పంద్రాగస్టు వచ్చినా అందని యూనిఫాంలు
Published Thu, Aug 15 2013 5:59 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
పేద, ధనిక, కుల, వర్గ తారతమ్యాలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఏకరూప దుస్తువులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విద్యార్థుల క్రమశిక్షణ అలవరిచేందుకు యూనిఫాంలు ఈ సంవత్సరం కూడా జెండా పండుగకు కూడా విద్యార్థులకు అందలేకపోతున్నాయి. ఈ సంవత్సరం ప్రభుత్వం యూనిఫాంలు కుట్టించే బాధ్యతల ను జిల్లా విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ కాంట్రాక్టు దర్జీలకు అప్పగించడం జరిగింది. మరికొన్ని చోట్ల గ్రామైక్య సంఘాలకు అప్పగించారు. ఆ బాధ్యతలను వారు సరిగ్గా నిర్వహించకపోవడంతో విద్యార్థులు పాత దుస్తువులతోనే జెండా పండుగను జరుపుకోవాల్సి వస్తున్నది. ఇప్పటివరకు ప్రభుత్వం విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలను పొదుపు పాటిగా అందించి తమ అసమర్థతను చాటుకున్నది.
దానికి తోడు విద్యార్థుల కొల తలు తీసుకుని యూనిఫామ్‌లు కుట్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినా అబాసుపాలైంది. గత సంవత్సరం లాగే ఈ విద్యా సంవ త్సరం కూడా విద్యార్థులకు ఆగస్టు 15కు దుస్తువులు అందలేకపోయాయి. జిల్లా వ్యాప్తంగా 2లక్షల 77వేల 859 మంది విద్యార్థులు(ఒకటి నుంచి 8వ తరగతి వరకు) ఒక విద్యార్థికి రెండు జతల చొప్పు న 5లక్షల 5వేల 718 యూనిఫామ్‌లు సరఫరా చేయా ల్సిఉంది. ఇందుకు రాజీవ్ విద్యామిషన్ ద్వారా కుట్టుటకు అయ్యే ఖర్చు జతకు రూ.400 చొప్పున రూ.22 కోట్ల 22లక్షలు ఎంఈఓల ఖాతాలో జమచేశారు. కానీ నిధులు కేటాయించి నెలలు గడుస్తున్నా విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేయలేకపోయారు.
పర్సంటేజీల వల్లే ఆలస్యం
జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల స్కూల్ కాంప్లెక్స్ ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లతో పర్సంటేజీలు మాట్లాడుకోవడం వల్లే కాంట్రాక్టర్ దర్జీలు అశ్రద్ధతో సరైన సమయానికి యూనిఫాంలు అందజేయలేకపోతున్నారు. ఒక స్కూల్ కాంప్లెక్స్‌లో ఉండే సుమారు వెయ్యి మంది విద్యార్థులకు యూనిఫాంలు అందజేయలేని పరిస్థితి నెలకొన్నది. జిల్లావ్యాప్తంగా ఆగస్టు 10 వరకు కేవలం 40శాతం మాత్రమే యూనిఫాంలను సరఫరా చేయడం జరిగిందని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. 60శాతం యూనిఫాంలు ఇంకా స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలోనే కనీసం దర్జీలకు బట్టలు సరఫరా చేయలేని పరిస్థితి నెలకొన్నది.
డీఈఓ వివరణ
ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్‌ను వివరణ కోరగా విద్యార్థుల యూనిఫాంల కోసం బట్టలు సరఫరా చేయాల్సిన ఏజెన్సీలు సకాలంలో బట్టను సరఫరా చేయకపోవడం వల్ల యూనిఫామ్‌లను పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోయామని వివరణ ఇచ్చారు. త్వరలోనే అందరికీ సరఫరా చేస్తామని డీఈఓ తెలిపారు.
Advertisement