రెండో పంటకు నీరివ్వలేం
Published Sun, Dec 1 2013 2:37 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రకృతి పగబట్టిం ది. జిల్లాపై పదే పదే పంజా విసిరి వ్యవసాయ, ఆర్థిక, సామాజిక రంగాలను చిదిమేసింది. ముఖ్యంగా అన్నదాతకు అపార నష్టం కలగజేసింది. పై-లీన్, భారీ వర్షాలు, హెలెన్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీరని నష్టం వాటిల్లింది. అధికారిక లెక్కల ప్రకారమే రూ.910 కోట్ల నష్టం తేలింది. నిండా మునిగిన రైతులు.. గండ్లు పడి, తెగిపోయిన కాలువలు, చెరువులు తదితర నీటిపారుదల వ్యవస్థలతో సమీప భవిష్యత్తులోనూ కోలుకునే అవకాశం లేకుండా పోయింది.
సాగునీటి వనరులు మరమ్మతులకు గురైన నేపథ్యంలో జిల్లాలో రెండో పంటకూ నీరిచ్చే అవకాశం లేదని జిల్లా అధికారి అయిన కలెక్టరే స్వయంగా వెల్లడించారు. దీంతో మళ్లీ ఖరీఫ్ వరకు పంట భూములను బీడులుగా వదిలేయాల్సిందే. అయితే విపత్తులతో కుంగిపోయిన రైతులు, ఇతర అన్ని వర్గాల వారికి సాధ్యమైనంతగా ఆదుకుంటామని, ఈ మేరకు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు పంపామని కలెక్టర్ సౌరభ్‌గౌర్ చెప్పారు. మరోవైపు జిల్లాను పీడిస్తున్న నకిలీ పాస్‌పుస్తకాలు, అడంగళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలు వంటి అనేకానేక అవినీతి చీడ పురుగులను ఏరిపారేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని శనివారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ఇంటర్వ్యూ విశేషాలు...
పై-లీన్ తుఫాన్, భారీ వర్షాల వల్ల జిల్లాకు జరిగిన నష్టం ఎంత?
మొత్తం రూ. 910 కోట్ల నష్టం జరిగిం ది. విభాగాల వారీగా నష్టం వివరాలతో సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాం.
రైతులకు జరిగిన నష్టం ఎంతని నిర్ధారించారు?
భారీ వర్షాల కారణంగా 85,154 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిని 2.52 లక్షల మంది రైతులు నష్టపోయారు. పై-లీన్, భారీ వర్షాల వల్ల 45 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు పూర్తిగా పోయాయి. ఈనెల 7వ తేదీలోగా పంచాయతీ కార్యాలయాల్లో నష్టపోయిన రైతుల జాబితాలు ఉంచుతాం. అభ్యం తరాలున్నా, అదనపు వివరాలున్నా తెలియజేయవచ్చు. రైతులు, రైతు సంఘాల నాయకులు చెప్పిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని నష్టం అంచనా వేశాం.
కొబ్బరి రైతులకు ఎటువంటి సాయం చేస్తారు?
కొబ్బరి రైతుల వివరాలు సిద్ధం చేశాం. సీఎం సూచన మేరకు పనికిరాకుండాపోయిన చెట్ల వివరాలు ప్రత్యేకంగా సేకరించాం. 10,741 హెక్టార్లలో కొబ్బరి, జీడి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. 4,24,091 కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. ప్రభుత్వం నుంచి అందే సూచనల మేరకు వీటికి సాయం అందిస్తాం.
వ్యవసాయ, ఉద్యాన పంటలకు జరిగిన నష్టమెంత?
వ్యవసాయ పంటలకు రూ. 85 కోట్లు, ఉద్యాన పంటలకు రూ. 40 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ మొత్తం రూ. 125 కోట్లను రైతులకు
Advertisement
Advertisement