సాక్షి, అమరావతి: సబ్సిడీ వర్తించని రైతులకు సైతం రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే)ల నుంచే అన్ని రకాల విత్తనాలను సరఫరా చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకు తగిన ఏర్పాట్లను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చేసింది. సబ్సిడీపై ఇచ్చే విత్తనాల పంపిణీ ఇప్పటికే పూర్తయింది. అయితే ప్రభుత్వ సబ్సిడీ వర్తించని రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పూర్తి ధరకు ఆర్‌బీకేల నుంచి విత్తనాలు తెప్పించుకునేలా ఏర్పాట్లు చేసింది. సబ్సిడీపై తీసుకున్నా ఇంకా అదనంగా విత్తనాలు కావాల్సిన వారు సైతం పూర్తి ధరకు తీసుకోవచ్చు. ఆర్‌బీకేల్లోని కియోస్క్‌లు లేదా గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా విత్తనాలను ఆర్డర్ చేసుకుంటే 48 గంటల్లో రైతు ఇంటి ముంగిటకే విత్తనాలు వస్తాయని ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు తెలిపారు.
► ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి గ్రామస్థాయిలో పలు రకాల విత్తన పంపిణీ ప్రారంభమైంది.
► విత్తనాలను రైతుల ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేసింది.
► నాణ్యమైన విత్తనాలను సబ్సిడీ వర్తించని రైతాంగానికి పూర్తి ధరకు ఆర్‌బీకేల వద్ద పంపిణీ చేయాలని సంకల్పించింది.
► జీలుగ, జనుము వంటివి 5, 10, 25 కిలోల పరిమాణంలో, పిల్లిపెసర 4, 8, 20 కిలోల సైజులో, వడ్లను (వరి) 10, 20, 25, 30 కిలోల సంచుల్లో ప్యాకింగ్ చేశారు.
► రైతులు తమకు ఎన్ని కావాలంటే అన్ని విత్తనాలు కొనుగోలు చేయవచ్చు.
► కరోనా నిరోధక చర్యల్లో భాగంగా కొన్ని ఆంక్షలున్నప్పటికీ విత్తన రవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఏపీ సీడ్స్ ఏపీఎస్‌ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుని విత్తనాన్ని గ్రామాలకు తరలించింది.
ఏడాదిలోనే రూ.4,800 కోట్లు ఆదా
► మాజీ సీఎం చంద్రబాబు విద్యుత్ రంగంలో సంస్కరణలను చేయాల్సిన రీతిలో చేయకపోవడం వల్ల అవి విద్యుత్ సంస్థలకు గుదిబండగా మారాయి.
► రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో పరిస్థితులను చక్కదిద్దుతున్నాం. అంతర్జాతీయ ఒప్పందాలను ఎక్కడా ఉల్లంఘించడం లేదు. కేంద్రం సూచనల వల్ల, కోర్టుల్లో కేసులు ఉండటం వల్ల టీడీపీ సర్కార్ కుదుర్చుకున్న పీపీఏలను సమీక్షించ లేకపోతున్నాం.
► బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకే దొరుకుతున్న విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాం. బొగ్గును రివర్స్ టెండరింగ్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. 2018–19లో విద్యుత్ సంస్థలు రూ.48,100 కోట్లు ఖర్చు చేస్తే.. 2019–20లో రూ.43,300 కోట్లు ఖర్చు చేశాం. అంటే.. ఒక్క ఏడాదిలోనే రూ.4,800 కోట్లను ఆదా చేశాం.
► పగటి పూటే రైతులకు 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు పది వేల మెగావాట్ల సామర్థ్యంతో బీవోటీ విధానంలో సంప్రదాయేతర విద్యుదుత్పత్తి సంస్థను నెలకొల్పుతున్నాం. దీని వల్ల సర్కారుపై ఉచిత విద్యుత్ భారం తగ్గుతుంది.
► కరోనా సమయంలో బహిరంగ మార్కెట్లో పోటీ విధానం ద్వారా తక్కువ ధరకే యూనిట్ రూ.1.75, రూ.రెండు చొప్పునే విద్యుత్‌ను కొనుగోలు చేసి.. సంస్థలకు ఆదా చేశాం. విద్యుత్ సంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తద్వారా తక్కువ ధరకే విద్యుత్‌ను సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
► ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లను కేంద్రం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. (ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు) ఏపీ, తెలంగాణ సర్కార్‌లు వ్యతిరేకించినా కేంద్రం తెచ్చే విద్యుత్ బిల్లు ఆగదు. చట్టంగా రూపుదాలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment