
'తెలంగాణ ఇవ్వాలని సీమాంధ్ర మంత్రులే సోనియాకు చెప్పారు'
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులే తెలంగాణ ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పారని ఆ పార్టీ సీనియర్ నేత డి.శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వారు చెప్పారని డీఎస్ గుర్తు చేశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులెవరూ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించి రాజీనామాలు చేయబోరని ఆయన స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు అవసరాలకనుగుణంగా మాట మర్చారని డీఎస్ విమర్శించారు. పాలకుల వైఫల్యంతోనే ఇరు ప్రాంతాల మధ్య అసమానతలు నెలకొన్నాయని ఆరోపించారు.