
గాయపడిన అనిల్
కాశీబుగ్గ : పలాసలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయపురం గ్రామానికి చెందిన పొట్నూరు అనిల్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనిల్ నడుచుకుని వస్తుండగా హడ్కో కాలనీకి చెందిన బోర తిరుమల బైకుపై వస్తూ అదుపుతప్పి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనలో కిందపడిన బాలుడిని పైకిలేపి ఇంటికి పంపించేశారు. కొద్దిసేపటి తర్వాత బాలుడు తీవ్రమైన నొప్పితో బాధపడటంతో కుటుంబ సభ్యులు తిరుమల ఇంటికి వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించారు.