
అశోక్‌బాబుకు ట్రిబ్యునల్‌లో చుక్కెదురు
* ఏపీ ఎన్‌జీఓ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగడానికి వీల్లేదని ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీ ఎన్‌జీఓ) సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబుకు సహకార ట్రిబ్యునల్‌లో చుక్కెదురైంది. ఏపీ ఎన్‌జీఓ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా, డెరైక్టర్‌గా అశోక్‌బాబు నియామకం.. నిబంధనలకు అనుగుణంగా లేదని సహకార ట్రిబ్యునల్ తేల్చింది.
అందువల్ల ఆయన అధ్యక్షుడిగా, డెరైక్టర్‌గా కొనసాగడానికి వీల్లేదంటూ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ శ్రీసుధ, సభ్యుడు డి.కృష్ణారెడ్డిలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కిందట మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కాపీ గురువారం అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఏపీ ఎన్జీవో సంఘంలో అశోక్‌బాబు సభ్యత్వం కేసు తేలేం త వరకు ఆయన హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా, డెరైక్టర్‌గా కొనసాగడానికి వీల్లేదని తేల్చి చెప్తూ.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.