గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిప్పు రాజుకుని మంటలు ఎగిశాయి. రెండు సిలిండర్లు కూడా పేలిపోయాయి. ఏడు కుటుంబాలవారు కూలిపనులకు పోయినపుడు ఈ అగ్నిప్రమాదం జరిగింది.
గోగులపాడులో ఏడు పూరిళ్లు దగ్ధం
Published Sun, Feb 21 2016 5:39 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement