
గవరపాలెం పెళ్లిలో వధూవరులు
అనకాపల్లి/అనకాపల్లి టౌన్: కరోనా వేళ కల్యాణం తీరే వేరు. పెళ్లంటే ..సందళ్లు..తప్పెట్లు..తాళాలు..ఇవేవి లేకుండానే కేవలం ఏడుగురు అతిథులే సాక్షులుగా వివాహ తంతులు ముగిశాయి. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ అమల్లో ఉండగా పరిమితమైన జనం అంటే కేవలం ఏడుగురితోనే పెళ్లి తతంగం పూర్తి చేసేందుకు అనుమతులు ఉండటంతో రెండు జంటలు గురువారం రాత్రి ఒక్కటయ్యాయి. వివరాలిలా.. గవరపాలెంలో పెళ్లి కొడుకు మహేశ్‌తో పాటు ఏడుగురు, తాకాశి వీధిలో పెళ్లికొడుకు ఈశ్వరరావుతో పాటు ఏడుగురు మాత్రమే ఉండేటట్లు పెళ్లి తతంగం పూర్తి చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు, పెళ్లి చేసే పురోహితుడు మాత్రమే ఉండేటట్లు కేవలం ఏడుగురితో రెండు పరిణాయాలు జరిగాయి.(కడచూపునకు ముగ్గురే !)
Comments
Please login to add a commentAdd a comment