మొయినాబాద్, న్యూస్‌లైన్: అభంశుభం తెలియని బాలిక (15)పై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవిచంద్ర కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబసభ్యులతో కలిసి బతుకుదెరువుకోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసవచ్చారు.
తాపీమేస్త్రీల వద్ద కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఐదు నెలల క్రితం మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌కు వచ్చి అద్దెకు ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన బేగరి ప్రభాకర్(40) మేస్త్రీ పనిచేస్తున్నాడు. అతని వద్ద వారు పనికి కుదిరారు. మంగళవారం సాయంత్రం గ్రామ శివారులోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో కొత్తగా నిర్మించే భవనానికి ముగ్గుపోసే పని ఉందని వారి కూతురిని తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై లైంగికదాడి చేశాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఎవరికీ అనుమానం రాకుండా బాలికను అదేరోజు రాత్రి ఇంటిదగ్గర వదిలేశాడు.
తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాలిక కుటుంబ సభ్యులు అదేరోజు అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు కేసు వెనక్కి తీసుకునేలా బాధితకుటుంబ సభ్యులపై కొంతమంది ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
బాలికపై లైంగికదాడి
Published Thu, Jan 23 2014 3:43 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement