ravi chandra
-
‘రెడ్‌బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్య పేరుతో జరిగే దోపిడీని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నారు?.. రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, చంద్రబాబు హయాంలో మళ్ళీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు.వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో మళ్లీ ప్రైవేటు కాలేజీల వేధింపులు పెరిగాయి. శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయి. ఫీజులు చెల్లించకపోతే బయటకు నెట్టేస్తున్నాయి. శ్రీ చైతన్య సంస్థ నిన్న ఒక విద్యార్థిని బయటకు నెట్టింది. తండ్రితో కలిసి ఆ విద్యార్థి కాలేజీ ఎదుట ధర్నా చేశాడు. విద్య పేరుతో జరిగే ఈ దోపిడీని వ్యతిరేకిస్తున్నాం. మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు?. రెడ్‌బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా?.ఫీజుల మానిటరింగ్ కమిటీ ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఫీజుల పేరుతో వేధింపులనేవే జరగలేదు. చంద్రబాబు హయాంలో మళ్లీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డులో నారాయణ సంస్థ సిబ్బందిని నియమించటం సిగ్గుచేటు. ఫీజుల గురించి వేధిస్తే వైఎస్సార్సీపీ హయాంలో బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇప్పుడు ఆ పని ఎందుకు చేయటం లేదు?. విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి.కార్పొరేట్ విద్యాసంస్థల్లో పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. నారాయణ, శ్రీ చైతన్య సంస్థలపై విచారణ జరపాలి. ఆ సంస్థలు పుస్తకాల ఫీజే రూ.18వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. రూ.50ల ఐడీ కార్డుకు రూ.400 వసూలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సీరియస్‌గా తీసుకుంటుంది. ఈ ప్రభుత్వ చర్యలపై ఉద్యమిస్తాం. నారాయణ, శ్రీ చైతన్య సంస్థల్లోని సిబ్బందికి సరైన జీతాలు ఇవ్వటం లేదు. పని భారంతో వేధింపులకు గురి చేస్తున్నారు. విద్యార్థుల నుండి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తూ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వటం లేదు’ అని ఆరోపించారు. -
ప్రజాకాంక్షలను ప్రతిఫలిస్తూ...
ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి, మలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ జనరంజక పాలన అందిస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో సంక్షేమా నికీ, అభివృద్ధికీ సమాన ప్రాధాన్యమిచ్చి, పదో వసంతంలోకి అడుగిడుతూ దేశవ్యాప్తంగా తన పాలనా మోడల్‌పై ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీలు, పేదలకు ఉద్దేశించిన అనేక పథకాలు ఆత్మగౌరవంతో ఆయా వర్గాలు నిలబడేలా చేస్తున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి తెలంగాణను పచ్చబార్చాయి. ఇది సంక్షేమ దశాబ్ది! ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత గడిచిన పదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధించుకుని దేశంలోనే అగ్రగామిగా తులతూగుతోంది. అందుకు గాను అహర్నిశలు కృషి చేస్తున్న నాటి ఉద్యమ సారథి, నేటి తెలంగాణ స్వరాష్ట్ర సారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నిజంగా గొప్పవారు. పదేండ్ల నుండి సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు కీలక పథకాల గురించి... ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఒకసారి సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలోని సుమారు 1.60 లక్షల దళిత కుటుంబాలకు లక్షలాది రూపాయలను అందించే ‘దళితబంధు’ పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం యావత్ దేశాన్ని నివ్వెర పరిచింది. దళితబంధు పథకం కోసం ఈ బడ్జెట్లో రూ. 17,700 కోట్లు ప్రతిపాదించ డమైనది. ‘అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్’ కింద 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. నూతనంగా ఏర్పడ్డ ప్రతి గిరిజన గ్రామ పంచాయతీకి భవన నిర్మాణం కోసం 20 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మద్యం షాపుల లెసైన్సుల కేటాయింపులో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించింది. ప్రస్తుత బడ్జెట్లో ‘షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి’ కింద రూ. 15,233 కోట్లు ప్రతిపా దించడమైనది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే పేదలకు రేషన్‌బియ్యం పంపిణీపై గత ప్రభుత్వాలు విధించిన పరిమితులను ఎత్తివేసింది. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా పింఛన్లు ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ‘ఆసరా’ పింఛన్ కింద ఇచ్చే మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచింది. దివ్యాంగుల పింఛన్‌ను 3,016 రూపాయలకు పెంచింది. ప్రజల కష్టాలెరిగిన ప్రభుత్వం గనుక మేని ఫెస్టోలో పేర్కొనక పోయినా, ఎవరూ డిమాండ్ చేయకపోయినా బీడీ కార్మి కులకు, ఒంటరి మహిళలకు, ఫైలేరియా బాధితులకు, డయాల సిస్ పేషంట్లకు సైతం 2,016 రూపాయలపింఛన్ నెలనెలా అందజేస్తున్నది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేనేతలకు గొప్ప అండదండలను అందిస్తున్నది. దీంతో చేనేత కార్మికుల బతుకుల్లో మంచి మార్పు వచ్చింది. వారి వృత్తికి భరోసా, భద్రత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లను చేనేత, పవర్లూమ్ పరిశ్రమలకు అప్పగిస్తున్నది. దీంతో సంవత్సరమంతా చేతి నిండా పని దొరుకుతున్నది. ప్రభుత్వం ‘చేనేత మిత్ర’ పథకం ద్వారా నూలు, రసాయనాల కొనుగోలుపై 50 శాతం సబ్సిడీని అంది స్తున్నది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 20,501 మంది చేనేత కార్మికులకు 33.17 కోట్లు సబ్సిడీ లభించింది. చేనేత కార్మికులకు ఆసరా పింఛన్ అందించడమే కాకుండా, నేతన్నకు బీమా పథకం కింద 5 లక్షల బీమానూ అందిస్తున్నది. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కురుమలకు చేయూతనివ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది. 11 వేల కోట్ల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. మన రాష్ట్రంలోని గొల్ల కురుమల వద్ద దేశంలోకెల్లా అత్యధిక సంఖ్యలో గొర్రెలున్నాయి. తెలంగాణ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత గౌడన్నల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకొన్నది. చెట్ల రఖం బకాయిలు రద్దు చేయడమే కాక, తాటి, ఈత చెట్లపై పన్ను వేసే పద్ధతికి స్వస్తి పలికింది. గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరాను సాఫ్ట్‌డ్రింక్‌గా మార్చి అందించే ప్రాజె క్టును చేపట్టింది. ప్రమాదవశాత్తూ మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని అందిస్తున్నది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లను కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా 2021– 22లో 51 కోట్లు ఖర్చు చేసింది. ఈ పరిషత్ ద్వారా పేద బ్రాహ్మణు లకు ఉపాధి కల్పన కోసం ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం 100 కోట్ల నిధిని సమకూర్చింది. బీసీ వర్గాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించి వారికి అండగా నిలిచింది. తెలంగాణ ఏర్పాటైన 2014 జూన్ నుంచి 2023 జనవరి వరకు ప్రభుత్వం 8,581 కోట్లను మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. క్రిస్మస్ సందర్భంగా దాదాపు 3 లక్షల మంది క్రైస్తవులకు కొత్త బట్టలతో కూడిన ప్రత్యేక కానుకలను ప్రభుత్వం అందిస్తున్నది. తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు కొత్త చీరలను పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను వదిలి వాటిని పట్టి అమ్ముకునేందుకు గంగపుత్ర, ముదిరాజ్ సోదరులకు అవ కాశం కల్పించింది. ఈ ప్రభుత్వ సహాయంవల్ల కులవృత్తుల వాళ్లు ఎంతగానో లాభపడ్డారు. ఇలా సంక్షేమ రంగంలో గడచిన తొమ్మి దేళ్ళ కాలంలో తెలంగాణ ప్రభుత్వం తిరుగులేని పనితీరును ప్రదర్శిస్తూ యావత్ భారతా వని దృష్టిని ఆకర్షించడం హర్షణీయం. వద్దిరాజు రవిచంద్ర వ్యాసకర్త రాజ్యసభ సభ్యులు, తెలంగాణ అభివృద్ధి సంబురాలు! అభివృద్ధి అంటే నిర్దే శించుకున్న లక్ష్యాల ప్రకారం మనుగడ సాగించగలగడం. అభి వృద్ధిని పెరుగుతున్న ప్రజల జీవన ప్రమా ణాలను బట్టి కొలు స్తారు. ప్రధాన వనరు లను ఉపయోగించు కొని ఉత్పత్తులను ఏ మేరకు గణనీయంగా పెంచుకున్నామన్న దానినే ఆచరణాత్మక ప్రగ తిగా చూస్తారు. అభివృద్ధి అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో సమున్నతంగా ఎదగటం. మనం జీవిస్తున్న కాలంలో మానవ వనరు లను ఏ రకంగా ఉపయోగించుకోగలుగు తున్నాం, ఉన్న వనరులను సంపద సృష్టి కేంద్రాలుగా ఏ మేరకు మార్చుకోగలిగాం అనే వాటి మీద అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి అభివృద్ధికి సంబంధించిన అంశాన్నీ తెలంగాణ రాష్ట్ర్రంలో స్పష్టంగా చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా ఒక శతాబ్ద కాలంలో జరగని అభివృద్ధి కేవలం ఓ దశా బ్దంలో జరగడం విస్మయం కలిగించే అంశం. ఇవ్వాళ దేశమంతా తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న అడుగుల్లో అడుగులు వేసుకుంటూ తెలంగాణ పథకాల నమూనాను కేంద్ర ప్రభుత్వమే అమలు జరిపే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎది గింది. మన దగ్గర ప్రారంభమైన ‘రైతు బంధు’ పథకం దేశంలోని మొత్తం రైతాంగాన్ని పరవ శింపజేసింది. ఇతర రాష్ట్రాల రైతులు తమ రాష్ట్రాల్లో కూడా ‘రైతు బంధు’ పథకాన్ని పెట్ట మని డిమాండ్ చేస్తున్నారు. దళిత సమాజానికి అండగా ‘దళిత బంధు’ పెట్టడం మొత్తం భారతదేశంలోనే పెను విప్లవంగా నిలిచింది. ఊరుకూ, వాడకూ మధ్య ఉన్న బెర్రల్ని చెరిపేసి వాడ దగ్గరికే ఊరు పోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోంది. అందరూ సల్లంగుండాలి, అందరూ సుఖపడాలి. అందుకు ‘అందరూ కలిసి కష్టపడాలి, సంపద పెంచాలి, సంపద పంచాలి’ అన్న దార్శనిక ఆలోచనలతో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటోంది. చీకటి కాలాన్ని పారదోలి విద్యుత్ వెలు గుల వెన్నెలను పంచే తెలంగాణగా విలసిల్లు తోంది. దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారం అయ్యింది. రాష్ట్రంలో 1,072 గురుకుల విద్యా లయాల్ని కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో నిర్మించారు. ఇవన్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా రిటీ బిడ్డలు చదువుకునే సర్కారు కార్పొరేట్ స్కూళ్ళుగా విలసిల్లుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం జల ప్రాజెక్టు ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీర్లను అబ్బు రపరుస్తోంది. వైద్యరంగానికి సంబంధించి పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు విస్తృత మయ్యాయి. వైద్యాన్ని పేదవాళ్లు కొనుక్కో వలసిన అవసరం లేకుండా వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళింది ప్రభుత్వం. తాజ్ మహల్ లాంటి సచివాలయం నిర్మించుకొని దానికి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు పెట్టడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడు గుల అంబేడ్కర్ విగ్రహం నిర్మించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సమ రంలో అసువులు బాసిన యోధుల్ని గుర్తు చేసు కుంటూ అమరజ్యోతిని నిర్మించుకున్నాం. నెర్రెలు బాసిన నేలపైన పసిడి పంటలు తులతూగే విధంగా చేసుకోగలిగాం. నల్లగొండకు పట్టిన ఫ్లోరోసిస్ పీడను ‘మిషన్ భగీరథ’ లాంటి ప్రాజెక్టు ద్వారా వదిలించుకోగలిగాం. ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువులు నిండు కుండలయ్యాయి. ఉపాధి అవకాశాలు పెంచ గలిగాం. హైదరాబాదులోని పటాన్ చెరువుకే పరిమితమైన పరిశ్రమలు, ఫార్మాసిటీలు ఇప్పుడు యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటుగా తెలంగాణ అంతటా విస్తరిస్తు న్నాయి. ‘ఈ–పాసుల’ ద్వారా సులభంగా ఇచ్చే అనుమతులతో పారిశ్రామిక రంగం ఊపందుకుంది. ఐటీ రంగం తెలంగాణలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రజల వద్దకు పాలనను తీసుకుపోయేటందుకు 33 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని రంగాలూ అభివృద్ధి చెందా లంటే మానవ వనరుల అభివృద్ధి అత్యంత ముఖ్యం. నైపుణ్యాలు పెంపొందాలంటే ఆరో గ్యవంతమైన సమాజం అవసరం. ఇప్పుడు ప్రతి జిల్లాలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందించే స్థితికి రాష్ట్రం ఎదిగింది. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాల వరకు టాబ్లెట్ ఇచ్చే స్థితి నుంచి డయాలసిస్ సైతం చేసే కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ‘కల్యాణ లక్ష్మి’, ‘కేసీఆర్ కిట్’, ‘పల్లె ప్రగతి’, ‘పట్టణ ప్రగతి’, బీసీ ఆత్మగౌరవ భవనాలు, ఇతర సంక్షేమ పథకాలు అన్నీ కేసీఆర్ మార్కు తెలంగాణ మోడల్‌కు నిదర్శనాలు.అభివృద్ధి అంటే ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో చేసే వాగ్దానం కాదు. కేసీఆర్ దార్శ నిక ఆలోచనలతో అభివృద్ధిని తెలంగాణ నేలపై ప్రవహింపజేసి చూపారు. జరిగిన అభి వృద్ధి ఊహకు అందనిది. తక్కువ కాలంలో సాధించిన ఈ ప్రగతి భవిష్యత్తును మరింత పటిష్ఠంగా నిర్మించుకుంటూ పోవడానికి భరోసా ఇస్తోంది. అందుకే తెలంగాణ ‘దశాబ్ది సంబురాలు’ ఎంతో ఉత్సాహంతో జరుపుకొంటోంది. ఊరూరా, వాడవాడలా ప్రభుత్వం సాధించిన ప్రగతిని చాటి చెçప్పుకుంటూ, సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు ఈ సంబురాలను వాడుకుంటోంది. వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడెమీ ఛైర్మన్ (నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం; దశాబ్ది ఉత్సవాల ప్రారంభం) జూలూరి గౌరీశంకర్ -
ప్రేమంటే ప్రమాదం
రవిచంద్ర, యుగా యుగేష్, సాయిశ్రీవి ముఖ్య పాత్రల్లో రాజ్ కింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్ ఈజ్ రిస్క్’. ఎస్.చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా పాటలను విడుదల చేశారు. నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ– ‘‘మా టీమ్ అంతా కష్టపడ్డాం అని అందరూ అంటున్నారు. ఎవరెంత కష్టపడ్డామన్నది సినిమా చూసి ప్రేక్షకులే నిర్ణయించాలి’’ అన్నారు. ‘‘ప్రతిభ ఉన్న దర్శకుడికి సరైన నిర్మాత కుదిరితే మంచి సినిమా వస్తుంది. అలా కుదిరిన సినిమాయే ‘ఇష్క్ ఈజ్ రిస్క్’’ అన్నారు సీనియర్ దర్శకుడు సాగర్. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు రవిచంద్ర. ‘‘హాస్యానికి పెద్ద పీట వేసిన చిత్రమిది. అందరికీ నచ్చుతుందనుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు రాజ్‌కింగ్. -
ప్రేమించడం ప్రమాదం
‘ఈ 2 మనసులు’ చిత్రంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు వ్యాపారవేత్త ఎస్. చంద్రశేఖర్. ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే ‘ఇష్క్ ఈజ్ రిస్క్’ అంటూ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారాయన. రవిచంద్ర, యుగా యుగేష్, సాయి శ్రీవి ముఖ్య తారలుగా రాజ్‌కింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. జేయస్సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శేఖర్ మూవీస్ పతాకంపై ఎస్.చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ– ‘‘లవ్ ఎంటర్టైనర్ రూపొందుతోన్న చిత్రమిది. హాస్యానికి పెద్ద పీట వేశాం. చక్కని టీమ్ కుదిరింది’’ అన్నారు. ‘‘దర్శకుడిగా ఇది నా రెండో చిత్రం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్‌గారికి థ్యాంక్స్. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు రాజ్ కింగ్. ఈ చిత్రానికి కెమెరా: జగన్. ఏ, సంగీతం: డేవిడ్. -
పోలీసుల ఎదుట లొంగిపోనున్న మిలీషియా సభ్యులు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోకు చెందిన 20 మంది మావోయిస్టు పార్టీకి చెందిన మిలీషియా సభ్యులు పోలీసులు ఉన్నతాధికారులు ఎదుట లొంగిపోనున్నారు. శనివారం ఉదయం 11.00 గంటలకు విశాఖ డీఐజీ ఎ.రవిచంద్ర, జిల్లా ఎస్పీ కొయ్య ప్రవీణ్ ఎదుట వారు లొంగిపోనున్నారు. లొంగిపోతున్న వారంతా జి.మాడుగుల మండలానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. -
నిరీక్షణ ఎవరికోసం?
విద్యార్థి దశలో పేద, ధనిక యువతీ యువకుల మధ్య ఏర్పడే సంఘర్షణలు ఇతివృత్తంగా, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రం ‘నీ కోసమే నా నిరీక్షణ’. సన్నీ రాజ్, వికాస్, రవిచంద్ర ముఖ్యతారలుగా స్కైవేస్ ప్రొడక్షన్స్ పతాకంపై రిజ్వాన్ అహ్మద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్ర నాయక్ దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన మహూర్తపు సన్నివేశానికి ఎంఐఎం నేత నవీన్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్‌నిచ్చారు. నిర్మాత బెక్కెం వేణగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేంద్ర నాయక్, సహ నిర్మాత: బి, మధుసూదన్‌రావు. -
'ప్రేమిస్తే.. పోయేకాలం' ఆడియో ఆవిష్కరణ
-
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలి
విజయనగరం ఆరోగ్యం:ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని అప్పుడే ప్రజలు ఆస్పత్రికి వస్తారని ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ(ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఎం.డి, విజయనగరం, విశాఖపట్నం ప్రత్యేకాధికారి ముద్దాడ రవిచంద్ర అన్నారు. జిల్లాకు బుధవారం వ చ్చిన ఆయన డీఆర్డీఏ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియూ, జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన అన్ని రకాల వైద్య పరీక్షలు జరిగేటట్టు చూడాలన్నారు. ఓఆర్ఎస్, జింక్ మాత్రలు ఏ మోతాదులో ఇవ్వాలో ఆశ వర్కర్లకు పూర్తి స్థారుులో అవగాహన కల్పించాలని సూచించారు. జింక్ మాత్రల విషయమై ఇండెంట్ మార్చాల్సి వచ్చిందని చెప్పారు. గర్భిణులకు సంబంధించి కొనుగోలు చేసే పరికరాల వివరాలను 15 రోజులకొకసారి పంపించాలని ఆదేశించారు. పీహెచ్‌సీలకు ఇచ్చిన ల్యాప్‌ట్యాప్‌లు ఎవరు వినియోగిస్తున్నారో వివరాలు పంపాలన్నారు. ఐరన్, ఫోలిక్ మాత్రలు పంపిణీ చేయడంలో సిబ్బంది విఫలమవుతున్నారని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలతో సమన్వయం కొరవడుతోందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడడం, మందులు అవసరం మేరకు అందజేయడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేరుుంచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఆస్పత్రులకు శానిటేషన్ నిధులు రెట్టింపు చేశామని తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐఎస్ఐ మార్కు కలిగిన రసాయనాలతో శుభ్రపరచాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని, వారికి బ్యాంకు ద్వారా జీతా లు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిం చాలని ఆదేశించారు. కేజీహెచ్‌లో పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడితే రూ.3700 ఇస్తున్నారని చెప్పారని, అటువంటి మోసానికి పాల్పడకుండా చూడాలన్నారు. పీహెచ్సీలో డాక్టర్, ఫార్మసిస్ట్, స్టాఫ్‌నర్సు ల్లో ఎవరో ఒకరు ఉన్నా వంద వరకు ఓపీ వస్తుందన్నారు. ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడం వల్లే ఓపీ తగ్గిపోతుందని చెప్పారు. మెడికల్ షాపు ల్లో ఫార్మసిస్ట్‌లు పూర్తి స్థారుులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే మండలానికొక జనరిక్ మందుల దుకాణాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వైద్యులు పలు సమస్యలు ఎండీ రవిచంద్రకు తెలియజేశారు. సమావేశంలో కేంద్రాస్పత్రి సూ పరింటెండెంట్ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ పరిశీలన... సమావేశ అనంతరం ఎం.డి. రవిచంద్ర సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను పరిశీలించారు. నిల్వ ఉన్న మందులపై ఆరా తీశారు. కార్యాలయూనికి కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేయూలని ఈఈ టీవీఎస్ఎన్ రెడ్డిని ఆదేశించారు. సమావేశంపై తప్పుడు సమాచారం... ఎం.డి రవిచంద్ర సమీక్ష సమావేశానికి సంబంధించి వైద్యారోగ్య శాఖాధికారులు తప్పుడు సమాచారంతో తికమక పెట్టారు. ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్‌లో సమీక్ష అని తొలుత తెలిపారు. తరువాత సమీక్ష సమావేశం రద్దరుుందని మీడియూకు చెప్పారు. తరువాత డీఆర్డీఏ సమావేశ మందిరంలో సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమాచారం మాత్రం మీడియూకు తెలియజేయలేదు. ఆస్పత్రి నిర్వహణపై ప్రత్యేక దృష్టి బెలగాం: ఆస్పత్రి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ ఎం.డి. రవిచంద్ర అన్నారు. ఇక్కడి ఏరియూ ఆస్పత్రిని ఆయన బుధవారం రాత్రి సందర్శించా రు. ఆస్పత్రిలో అన్ని వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెనూ సక్రమంగా అమలు చేయూలని సూచించారు. ఆయ న వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, జిల్లా ఆస్పత్రుల సమన్వయూధికారి డాక్టర్ విజయలక్ష్మి, ఏరియూ ఆస్ప త్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నాగభూషణరావు, ఎస్ఈ చిట్టిబాబు, ఈఈ టీవీఎస్ఎన్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
బాలికపై లైంగికదాడి
మొయినాబాద్, న్యూస్‌లైన్: అభంశుభం తెలియని బాలిక (15)పై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవిచంద్ర కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబసభ్యులతో కలిసి బతుకుదెరువుకోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసవచ్చారు. తాపీమేస్త్రీల వద్ద కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఐదు నెలల క్రితం మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌కు వచ్చి అద్దెకు ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన బేగరి ప్రభాకర్(40) మేస్త్రీ పనిచేస్తున్నాడు. అతని వద్ద వారు పనికి కుదిరారు. మంగళవారం సాయంత్రం గ్రామ శివారులోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో కొత్తగా నిర్మించే భవనానికి ముగ్గుపోసే పని ఉందని వారి కూతురిని తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై లైంగికదాడి చేశాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఎవరికీ అనుమానం రాకుండా బాలికను అదేరోజు రాత్రి ఇంటిదగ్గర వదిలేశాడు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాలిక కుటుంబ సభ్యులు అదేరోజు అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు కేసు వెనక్కి తీసుకునేలా బాధితకుటుంబ సభ్యులపై కొంతమంది ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.