ప్రేమించడం ప్రమాదం | Ishq is Risk shooting starts in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమించడం ప్రమాదం

Published Fri, Jun 14 2019 12:52 AM | Last Updated on Fri, Jun 14 2019 12:52 AM

Ishq is Risk shooting starts in hyderabad - Sakshi

సాయి శ్రీవి, రవిచంద్ర, యుగేష్‌

‘ఈ 2 మనసులు’ చిత్రంతో  సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు వ్యాపారవేత్త ఎస్‌. చంద్రశేఖర్‌. ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే ‘ఇష్క్‌ ఈజ్‌ రిస్క్‌’ అంటూ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారాయన. రవిచంద్ర, యుగా యుగేష్, సాయి శ్రీవి ముఖ్య తారలుగా రాజ్‌కింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జేయస్సార్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సమర్పణలో శేఖర్‌ మూవీస్‌ పతాకంపై ఎస్‌.చంద్రశేఖర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఎస్‌.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘లవ్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందుతోన్న చిత్రమిది. హాస్యానికి పెద్ద పీట వేశాం. చక్కని టీమ్‌ కుదిరింది’’ అన్నారు. ‘‘దర్శకుడిగా ఇది నా రెండో చిత్రం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్‌గారికి థ్యాంక్స్‌. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు రాజ్‌ కింగ్‌. ఈ చిత్రానికి కెమెరా: జగన్‌. ఏ, సంగీతం: డేవిడ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement