నిరీక్షణ ఎవరికోసం? | Nee Kosame Naa Nireekshana launched | Sakshi
Sakshi News home page

నిరీక్షణ ఎవరికోసం?

Apr 20 2015 11:29 PM | Updated on Sep 3 2017 12:35 AM

నిరీక్షణ ఎవరికోసం?

నిరీక్షణ ఎవరికోసం?

విద్యార్థి దశలో పేద, ధనిక యువతీ యువకుల మధ్య ఏర్పడే సంఘర్షణలు ఇతివృత్తంగా, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా

విద్యార్థి దశలో పేద, ధనిక యువతీ యువకుల మధ్య ఏర్పడే సంఘర్షణలు ఇతివృత్తంగా, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘నీ కోసమే నా నిరీక్షణ’.  సన్నీ రాజ్, వికాస్, రవిచంద్ర ముఖ్యతారలుగా స్కైవేస్ ప్రొడక్షన్స్ పతాకంపై రిజ్వాన్ అహ్మద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్ర నాయక్ దర్శకుడు. ఇటీవలే  ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.  హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన మహూర్తపు సన్నివేశానికి ఎంఐఎం నేత నవీన్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్‌నిచ్చారు. నిర్మాత బెక్కెం వేణగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.  ఈ చిత్రానికి సంగీతం: రాజేంద్ర నాయక్, సహ నిర్మాత: బి, మధుసూదన్‌రావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement