సాక్షి, మంచిర్యాల : పల్లెల్లో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. గ్రామీణులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ల(ఆరోగ్య కార్యకర్త) నియామకాలు చేపట్టకపోవడంతో గ్రామీణులకు వ్యాధులపై అవగాహన కరువైంది. పురుష ఆరో గ్య కార్యకర్తలు మలేరియా, పైలేరియా, డెంగీ ఇతర సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేయడం, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంతోపాటు నెలకోసారి గ్రామంలో ప్రతి ఇంటికీ తిరిగి ప్రజలకు ఆరోగ్య విషయాలు తెలపాలి. మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఇమ్యూనైజేషన్(పల్స్ పోలియో, గర్భిణులు, బాలింతల కు అవగాహన) కార్యక్రమాలు చేపట్టాలి. అయితే జిల్లాలో సిబ్బంది కొరత కారణం గా పనిభారం ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తు న్న వారిపైనే పడుతోంది. చాలా గ్రామాల్లో ఇరువురు కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలను ఆశ్రయించి వారి ద్వారా రిపోర్టులు సేకరించి అధికారులకు నివేదిస్తున్నట్లు సమాచారం. వీరి అలసత్వం కారణంగా పల్లెల్లో వ్యాధులపై ప్రజలకు అవగాహన కరువవుతోంది.
సగం పోస్టులు ఖాళీ
జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 7,25,048 మంది, సాధారణ ప్రాంతాల్లో 20,63,596 మంది మొత్తం 27,88,644 మంది జనాభా ఉంది. గిరిజన ప్రాంతాల్లో 3 వేలు, సాధారణ ప్రాంతాల్లో 5 వేల జనాభాకు ఒక్కొక్కరి చొప్పున జిల్లాలో మొత్తం 653 మంది మహిళ, అంతే మంది పురుష ఆరోగ్య కార్యకర్తలు ఉండాలి. అయితే జిల్లా వ్యాప్తంగా 653 మహిళ కార్యకర్తలకు 518 పోస్టులు మంజూరయ్యాయి. అందులో కేవలం 420 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 653 మంది పురుష కార్యకర్తల పోస్టులకు గానూ 304 పోస్టులు మాత్రమే మంజూరు కాగా అందులో 140 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న పురుష, మహిళ కార్యకర్తల్లో 20 మంది మాత్రమే రెగ్యులర్ గా ఉన్నారు. మిగిలిన వారందరూ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. దీనికి తోడు ఆరోగ్య కార్యకర్తల పనులు పర్యవేక్షించాల్సిన 36 హెల్త్ సూపర్ వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 95 పురుష సూపర్ వైజర్ పోస్టులు మంజూరు కాగా 70 మంది పనిచేస్తున్నారు. 97 మహిళా సూపర్‌వైజర్లు పోస్టులుంటే 86 మంది ఉన్నారు.
ఎనిమిదేళ్ల నుంచి నియామకాలు లేవు..
రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పురుష అభ్యర్థులు బోగస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందారని ఎనిమిదేళ్ల క్రితమే కేంద్రం గుర్తించింది. జూన్, 2002కు ముందు సర్టిఫికెట్లు పొందిన వారికే ఉద్యోగాలు కల్పించాలంటూ అప్పట్లోనే ఆదేశించింది. దీంతో ఆ తర్వాత విద్యార్హత పొందిన అభ్యర్థులు మాకూ అవకాశం కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఇంతవరకు ఆ తీర్పు వెలువడలేదు. దీంతో పురుష మల్టీపర్పస్ హెల్త్ నియామకాలకు బ్రేక్ పడింది. మరోపక్క ఏ సమస్య లేని మహిళా ఆరోగ్య కార్యకర్తల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో పోస్టుల భర్తీకి గ్రహణం పట్టుకుంది. దీంతో గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాలో సగానికి పైగా పోస్టులు ఖాళీలు ఉండడం, పనిచేస్తున్న వారందరూ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తుండడంతో పల్లెల్లో వైద్యసేవలు అందడం లేదు.
కొరవడిన పర్యవేక్షణ
పల్లెల్లో పర్యటించి వ్యాధులపై అవగాహన కల్పించాల్సిన సిబ్బంది సరిగా పని చేస్తున్నారా? లేదా? అని తెలుసుకోవాల్సిన వైద్యాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విషజ్వరాలు, మలేరియా ప్రబలి పరిస్థితి చేయి దాటిన ప్పుడే స్పందించడం అధికారులకు పరిపాటిగా మారింది. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుంది. హెల్త్ సూపర్‌వైజర్లు పదవీ విరమణ పొందుతుంటే ఆ పోస్టులు హెల్త్ వర్కర్లతో భర్తీ చే స్తున్న ప్రభుత్వం ఆరోగ్య కార్యకర్తల పోస్టులను భర్తీ చేయకపోవడంతో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి జిల్లాలో ఖాళీగా ఉన్న ఆరోగ్య కార్యకర్తల పోస్టులు వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా మలేరియా అధికారి అల్హం రవి అడుగగా.. పురుష మల్టీ పర్పస్ హెల్త్‌వర్కర్ల అంశం కోర్టులో ఉండడంతో నియామకాలు చేపట్టడం లేదన్నారు. మహిళ వర్కర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉంది.
వైద్యంపై నిర్లక్ష్యం
Published Wed, Oct 23 2013 3:32 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement