సిక్కోలు సత్తా చూపుదాం | Sikhs samaikya sankharavam meeting Capabilities cupudam | Sakshi
Sakshi News home page

సిక్కోలు సత్తా చూపుదాం

Published Wed, Oct 23 2013 2:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

Sikhs samaikya sankharavam meeting Capabilities cupudam

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: సిక్కో లు సత్తా చూపుదాం.. సమైక్య స్ఫూర్తి చాటుదాం.. శంఖారావం సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళదాం.. అని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా నేతలు తీర్మానించుకున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ లక్ష్యంతో పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లో జరగనన్ను సమై క్య శంఖారావం సభపై మంగళవారం జరిగిన ఆ పార్టీ జిల్లా శాఖ సమావేశం లో నాయకులు చర్చించారు. రాజధాని సభకు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరై సిక్కోలు సత్తా చాటాలని పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పిరియా సాయిరాజ్‌లు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
 
 సమైక్యాంధ్ర కోసం మొదటి నుంచీ పోరాడుతున్న ఏకైక  రాజకీయ పార్టీ వైఎస్‌ఆర్‌సీపీయేనని వారన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు ప్రజలకు వివరించి, అవగాహన కల్పించాల న్నారు. జగన్‌మోహనరెడ్డి  సమర్థ నాయకత్వంతోనే సమైక్యాంధ్ర సాధ్యమని ప్రజలంతా విశ్వసిస్తున్నారన్నారు. దానికి అనుగుణంగా పనిచేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  శంఖారావం సభకు అత్యధిక సంఖ్యలో ప్రజలు, ఉద్యోగులు హాజరై మనవాణిని ఢిల్లీ గద్దెకు వినిపించేలా చేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమకు అందుబాటులో ఉన్న వాహనాల్లో హైదరాబాదుకు తరలివెళ్తున్నారన్నారు.  జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లేలా పార్టీ నేతలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
 ఏ పార్టీలకు లేని విధంగా జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు. సమైక్య శంఖారావ సభ కోసం ఈనెల 25న ఉదయం 9 గంటలకు పలాస నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందని వెల్లడించారు. ఈ రైలులో నియోజకవర్గానికి  ఒక బోగీ చొప్పున పది బోగీలు ఏర్పాటు చేస్తారన్నారు. ఆయా బోగీల్లో ప్రయాణించే వారికి వసతులు కల్పించాల్సిన బాధ్యతను  నియోజకవర్గ సమన్వయకర్తలు స్వీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే మిగతా నాయకులు, ముఖ్య కార్యకర్తలు తమకు అందుబాటులో ఉన్న వాహనాల్లో తరలివెళ్లాలని పిలుపునిచ్చారు.
 
 ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బగ్గు లక్ష్మణరావు, మాజీమంత్రి తమ్మినేని సీతారాం,  అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు వరుదు కల్యాణి, వై.వి.సూర్యనారాయణ, కిల్లి రామ్మోహనరావు, బొడ్డేపల్లి మాధురి, దువ్వాడ శ్రీనివాస్, విశ్వసరాయి కళావతి, పీఎంజే బాబు, కలమట వెంకటరమణ,  వజ్జ బాబూరావు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బల్లాడ హేమమాలినీరెడ్డి, నాయకులు మార్పు ధర్మారావు, అంధవరపు సూరిబాబు, ధర్మాన ఉదయ్‌భాస్కర్, బల్లాడ జనార్దనరెడ్డి, ఎన్ని ధనుంజయ్, గేదెల రామారావు, గేదెల పురుషొత్తం, తంగి శివప్రసాద్, ఆరంగి మురళీధర్, చింతాడ గణపతిరావు, డి.ఆర్.రమణనాయుడు, సూర్యప్రకాశరావు, పూడి నేతాజీ, బళ్ళ గిరిబాబు, మహమ్మద్ సిరాజుద్దీన్, దాసరి పూర్ణచంద్రరావు, ఎన్.శ్రీను,  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement