జులైవాడ, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటనతో భౌగోళిక తె లంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమైందని... అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. పౌరసమాజం స్వేచ్ఛగా బతికేలా రాజ్యహింసలేని రాజ్యం... సామాజికవర్గాలు, పీడిత వర్గాలు తల ఎత్తుకుని సమన్యాయంగా జీవించే ప్రజాస్వామిక తెలంగాణ కోసం పౌరహక్కుల సంఘం, ప్రజాస్వామిక వాదులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. హన్మకొండలోని జిల్లా పరిషత్ హాల్‌లో ఆదివారం జరిగిన పౌరహక్కుల సంఘం జిల్లా మహాసభలో ‘తెలంగాణ అవరోధాలు.. కర్తవ్యాలు’ అంశంపై ఆయన మాట్లాడారు. హై దరాబాద్ స్టేట్ నిజాం రాజు పాలనలో ఉన్న ఒకప్పటి స్వ తంత్ర దేశమన్నారు. నిజాం రాజుతో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ చేసుకున్న ఒప్పంద చరిత్రను వెలుగులోకి రాకుండా అప్పటి భారత ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు. నెహ్రూ తన బంధువైన కాశ్మీర్ రాజుతో ఒప్పందం చేసుకుని దాన్ని భారతదేశంలో కలుపుకున్నారన్నారు. అయితే నిజాంరాజుపై మాత్రమే సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారా సైనిక దాడి జరిపించి ఎలాంటి షరతులు లేకుండా నెహ్రూ నిజాం రాజ్యాన్ని లొంగదీసుకున్నారని చెప్పారు.
కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ర్టమని... అ క్కడ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఒక ఎకరం భూమి కూడా కొ నలేరని... ఆ హక్కు కాశ్మీర్‌లో ఉండదన్నారు. అలాంటి స్వ యం ప్రతిపత్తి తెలంగాణకు ఉండి ఉంటే... సీమాంధ్రులు ఇక్క డ పెట్టుబడులు పెట్టేవారు కాదని.. నిజాం సర్పేఖాస్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే వారు కాదన్నారు. ఇలా భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనమైనప్పుడు అప్పటి ప్రభుత్వం తీరని అన్యాయానికి ఒడిగట్టిందన్నారు. తెలంగాణ ప్రాం త ప్రజలు విడిపోదామని నిర్ణయించుకున్నాక... కలిసి ఉండాలని కోరుకోవడం సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆస్తుల పరిరక్షణ ఉద్యమంలో భాగమేనన్నారు. సీమాంధ్ర ఎంపీల్లో ఎక్కువ మంది కాంట్రాక్టర్లేనని.. చివరకు తెలంగాణలోని మన ఊళ్లకు వెళ్లాలన్న ఆంధ్రోళ్ల టోల్‌గేట్‌కు డబ్బులు కట్టాల్సిన దౌర్భాగ్య ప రిస్థితి దాపురించిందన్నారు. సుబ్బిరామిరెడ్డి, లగ డపాటి రాజ గోపాల్, కావూరి, రాయపాటి సాంబశివరావు లాంటి కాంట్రాక్టర్లు సమైక్యాంధ్ర ఉద్యమానికి పెట్టుబడి పెట్టి నడిపిస్తున్నారన్నారు. తెలంగాణ భూములను కారుచవకగా తీసుకోవడమే కా కుండా వాటిపై అప్పులు పొందిన సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును వారి వ్యాపార, ఆర్థిక ప్రయోజనాల కోసమే అడ్డుకుంటున్నారని విమర్శించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులను గోబ్యాక్ అనకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారు అడ్డం పడుతూనే ఉంటారన్నారు. పదేళ్లలో రెండు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను సీమాంధ్ర పెట్టుబడిదారులు దక్కించుకున్నారని తెలిపారు. తెలంగాణ వనరులను అన్నివిధాలా దోచుకున్న మూర్ఖులకు తెలంగాణ ప్రజలతో కలిసి ఉంటామనే హక్కు లేదన్నారు. ఆర్టికల్-3 ప్రకారం కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పౌరహక్కుల సంఘం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోనూ పేద ప్రజల పక్షాన నిలబడి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ప్రజాస్వామిక వాదులను సిద్ధం చేయాలని సూచించారు.
ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మించాలి : సురేష్‌కుమార్
తెలంగాణ తరహాలో పౌరహక్కుల రక్షణ కోసం ప్రజాఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, హైకోర్టు న్యాయవాది దర్బ సురేష్‌కుమార్ అన్నారు. ‘పౌరహక్కుల ఉద్యమం... కోర్టులు... కర్తవ్యాలు’ అంశంపై ఆయన మాట్లాడుతూ ఎన్‌కౌంటర్ పేరిట రాజ్యం చేస్తున్న హత్యలను కోర్టుల్లోనే గాక పౌరసమాజం ద్వారా ఉద్యమం రూపంలో ఒత్తిడి తెచ్చి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. నూతన ఆర్థిక విధానాలతో ప్రభుత్వ పాలసీలను రక్షించేలా కోర్టులు తయారయ్యాయన్నారు. కేసులు... న్యాయవాదులకు ఇచ్చే ఫీజు, న్యాయవాది కమిట్‌మెంట్ మీద ఆధారపడి ఉన్నాయని చెప్పారు. 2009లో హైకోర్టు ధర్మాసనం ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసు అధికారులు పేర్లు వెల్లడించాలని, ఎన్‌కౌంటర్ మృతులకు శవపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినా... అనేక సందర్భాల్లో అవి అమలు కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వం దిగిరావడానికి పౌరసమాజంలో వచ్చిన ప్రజా ఉద్యమాలే కీలకపాత్ర పోషించాయన్నారు. ప్రజా ఉద్యమాలు... రాజ్యం అణచివేత’పై పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ మాట్లాడుతూ అణచివేతలో భాగంగా పౌరహక్కుల నాయకులైన రామనాథం, నర్రా ప్రభాకర్‌రెడ్డి, పురుషోత్తం, ఆజం అలీ, గోపు రాజన్న వంటి నాయకులను కోల్పోయూమన్నారు. నల్లావసంత్ ఎన్ కౌంటర్... సాంబశివుడు, బెల్లి లలిత హత్యలు తెలంగాణ ఉద్యమంపై అణచివేతలో భాగంగా జరిగాయన్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తిరుమలరావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి పాల్గొన్నారు. సీఎల్‌సీ జిల్లా క న్వీనర్ అనంతుల సురేష్ అధ్యక్షత వహించిన సభలో పౌరహక్కుల సంఘం జిల్లా బాధ్యులు పి.రమేష్ చందర్ ఆహ్వానం పలకగా... రాజేశ్వర్‌రావు సభను ముగించారు. సభలో సౌహర్ద్ర ప్రతినిధులుగా తెలంగాణ ప్రజాఫ్రంట్ నుంచి రమాదేవి, మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు కందాళ శోభారాణి, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు శాంత, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు సుధాకర్, తెలంగాణ ట్రైబల్ జేఏసీ కన్వీనర్ పోరిక ఉదయసింగ్ మాట్లాడారు. బహుజన సాంస్కృతిక సమాఖ్య బృందం పాడిన పాటలు సభికుల్లో ఉద్యమస్ఫూర్తిని నింపాయి.
పౌరహక్కుల సంఘం జిల్లా కన్వీనర్‌గా సురేష్
పౌరహక్కుల సంఘం వరంగల్ జిల్లా కన్వీనర్‌గా అనంతుల సురేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కో కన్వీనర్‌గా పి.రమేష్‌చందర్, కమిటీ కార్యవర్గసభ్యులుగా న్యాయవాది ఆర్.రాజేశ్వర్‌రావు, రాజారం ఎన్నికయ్యూరు. కాగా... వరంగల్ జిల్లా సభలు 12 ఏళ్ల తర్వాత ఉద్యమ స్ఫూర్తితో జరిగాయి. ప్రాణాలు కోల్పోయిన హక్కుల నేతలు, తెలంగాణ ఉద్యమకారులకు సభలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అంతేకాకుండా పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని, పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని, నల్లచట్టాలను రద్దు చేయాలని, ఓపెస్‌కాస్ట్‌లను ఎత్తివేయాలని, తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని తీర్మానించారు.
సీమాంధ్ర పెట్టుబడిదారులారా.. గో బ్యాక్
Published Mon, Sep 23 2013 4:31 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement