కలెక్టరేట్, న్యూస్‌లైన్: అన్నదాత రెక్కల కష్టం వర్షార్పణమవుతోం ది. మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు రైతులను కంటతడి పెట్టిస్తున్నా యి. పంట చేతికొచ్చే సమయంలో పడుతున్న చినుకులు కష్టజీవులకు వణుకు పుట్టిస్తున్నాయి. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు అన్నదాతలను కలవరపరుస్తున్నాయి.
ఇప్పటికే వేలాది హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పత్తి చేన్లలో నీళ్లు నిలి చాయి. కల్లాల వద్ద ఉన్న మొక్కజొన్న తడిసింది. వరిపైరు నేలకొరిగింది. వర్షాలతో దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేయాల్సిన వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కనీసం పంటల వైపు అధికారులు కన్నెత్తిచూడడం లేదు. పైగా ఈ వర్షాలతో పెద్దగా నష్టం లేదని అధికారులు అంటుండంతో రైతులకు పుండుమీద కారం చల్లినట్లవుతోంది.
ఆశలు ఆవిరి
జిల్లాలో 4.51 లక్షల ఎకరాల్లో వరి, 6 లక్షల ఎకరా ల్లో పత్తి, 1.46 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట లు సాగు చేశారు. దిగుబడులపై రైతన్న ఆశలు ప్రస్తుతం సన్నగిల్లుతున్నాయి. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామని మార్కెట్‌యార్డులకు వస్తే అకాల వర్షం వేలాది క్వింటాళ్లలో వరి, మొక్కజొన్న ఉత్పత్తులను ముంచెత్తడాన్ని రైతులు తట్టుకోలేకపోతున్నారు. జిల్లాలో మొక్కజొన్న కోతలు దాదాపు పూర్తయ్యాయి.
పత్తి కాయలు పూర్తిస్థాయిలో పగి లాయి. తొలిదఫా ఏరిన పత్తి మార్కెట్‌లో విక్రయానికి వస్తుండగా రెండోధఫా ఏరేందుకూ రైతులు సిద్ధమవుతున్నారు. వరి కోతలు ముమ్మరమవుతున్నాయి. ఈ క్రమంలో వరుణుడు ప్రతాపం చూప డం అన్నదాతలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. మరో మూడు, నాలుగు రోజులు వర్షాలు కురిస్తే నీరు నిలిచి వరిపంటకు తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదముంది. వర్షాలతో పత్తి పూత రాలింది. పగిలిన పత్తి ఎరుపురంగులోకి మారి నాణ్యత దెబ్బతింది.
ఇంతకుముందే అధిక వర్షాలతో పత్తిరైతులు దెబ్బతిని ఉన్నారు. కోతలు పూర్తయిన మొక్కజొన్న కంకులు కల్లాల వద్దే మొలకలెత్తుతున్నాయి. మక్కలు నలుపురంగులోకి మారుతున్నాయి. నేలకొరిగిన వరిని ఈ సమయంలో మెషీన్ల ద్వారా కోయడం దుస్సాధ్యమే. పూతదశలోని టమాట కాకర, మిర్చి పంట లకూ నష్టం అధికమే. పసుపు, కంది, కూరగాయల పంటల్లోనూ చీడపీడల ఉధృతి పెరిగింది. రంగుమారిన ధాన్యం, మక్కలకు తక్కువ ధర పల కవచ్చు. జిల్లా యంత్రాంగం..బాధిత రైతులను ఆదుకోవాలని రైతుసంఘాలు కోరుతున్నాయి.
జిల్లాలో 3.1 సెంటీమీటర్ల సగటు వర్షపాతం
జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి గురువారం ఉదయం 8.30 గంటలకు ఒకటి మినహా అన్నిమండలాల్లో వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 3.1 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా శ్రీరాంపూర్ మండలంలో 9.6 సె.మీ. వర్షం కురిసింది. కరీంనగర్ మండలంలో 4.8, మానకొండూర్‌లో 3.5, తిమ్మాపూర్‌లో 4.3, బెజ్జంకిలో 3.2, గంగాధరలో2.3, రామడుగులో 2.2, చొప్పదండిలో 4.3, హుస్నాబాద్‌లో 4.6, చిగురుమామిడిలో 3.6, కోహెడలో 4.8, హుజూరాబాద్‌లో 4.6, జమ్మికుంటలో 4.7, వీణవంకలో 4.3, కమలాపూర్‌లో 3.6, ఎల్కతుర్తిలో 4.5, కేశవపట్నంలో 3.5, సైదాపూర్‌లో 2.6, భీమదేవరపల్లిలో 3.6, సిరిసిల్లలో 3.6, ఇల్లంతకుంటలో 2.2, గంభీరావుపేటలో 5, ముస్తాబాద్‌లో 3.2, ఎల్లారెడ్డిపేటలో 2.5, వేములవాడలో 4.4, చందుర్తిలో 2.9, పెద్దపల్లిలో4.8, ఓదెలలో 7.8, రామగుండంలో 3.8, సుల్తానాబాద్‌లో 7.5, జూలపల్లిలో 4, ఎలిగేడులో 5.3, కమాన్‌పూర్‌లో4.2, మంథని ముత్తారంలో 6.7, మల్హర్‌రావులో 4, కాటారంలో 3.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసింది.
ముసురు ముంచింది
Published Fri, Oct 25 2013 2:55 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement