సాక్షి, విజయవాడ: సింగ్ నగర్‌లో డంపింగ్ యార్డును తరలించి అదే ప్రాంతంలో పార్క్‌ను ఏర్పాటు చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ తరలింపుపై విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌కు ఆయన కీలక సూచనలు చేశారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో శుక్రవారం పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించించారన్నారు. అందులో భాగంగా వాంబే కాలనీ డంపింగ్ యార్డు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని సింగ్‌నగర్‌లోని డంపింగ్ యార్డ్‌ను గుంటూరుకు తరలించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాంబే కాలనీ, సింగ్ నగర ప్రాంతవాసుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment