పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు స్థల పరిశీలన | Site evaluation for petroleum university | Sakshi
Sakshi News home page

పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు స్థల పరిశీలన

Published Tue, May 19 2015 1:22 PM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

Site evaluation for petroleum university

పిఠాపురం: పెట్రో యూనివర్సిటీ ఏర్పాటు కోసం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రూరల్ మండలం మాధాపురంలోని కాసు చెరువు భూములను అధికారులు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీవో అంబేద్కర్ సిబ్బందితో కలసి మంగళవారం మధ్యాహ్నం మాధాపురం చేరుకుని కాసు చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ 215 ఎకరాల భూమి అందుబాటులో ఉండగా, అందులో ఏమైనా ఆక్రమణలు ఉన్నాయా తదితర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల కాకినాడ సమీపంలోని వేట్లపాలెంలో జరిగిన సభలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement