మచిలీపట్టణం(కృష్ణా జిల్లా): బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లి 20 రోజుల క్రితం గల్లంతైన ఆరుగురు మత్య్సకారులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది.
కృష్ణా జిల్లా జిలకలబిండికి చెందిన నాగూర్, నాగరాజులు నెల్లూరు జిల్లాకు చెందిన మరో నలుగురు జాలర్లను ఒరిస్సా రాష్ట్రంలోని పారదీప్‌కు 40నాటికన్‌మైళ్ల దూరంలో శుక్రవారం గుర్తించినట్లు నౌకాదళం ప్రకటించింది. దీంతో వారి ఆచూకీకోసం తల్లడిల్లుతోన్న కుటుంబసభ్యులు కాస్త ఊరటచెందారు. ఈరోజు సాయంత్రానికి వారిని ఒరిస్సాకు చేర్చి అక్కడినుంచి మలిచిపట్టణంకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆ ఆరుగురు జాలర్లు సురక్షితం
Published Fri, Jul 3 2015 1:46 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM
Advertisement
Advertisement