స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులకు ఆరు నగరాలు
అమరావతి: స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులకు ఆంధ్రప్రదేశ్లోని ఆరు నగరాలు ఎంపికయ్యాయి. 2017 సంవత్సరానికి సర్వేక్షణ్ అవార్డుల కోసం కేంద్రం పలు నగరాలను ఎంపిక చేసింది.
తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, ఒంగోలు, తాడిపత్రి నగరాలను ఇందుకు ఎంపిక చేశారు. ఆ అవార్డులను కేంద్ర ప్రభుత్వం మే 4న ప్రదానం చేయనుంది.