swaccha servaction
-
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పులివెందులకు ఉత్తమ ర్యాంకు
సాక్షి,పులివెందుల : దేశవ్యాప్తంగా ఈఏడాది నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2019లో పులివెందుల మున్సిపాలిటీకి అత్యుత్తమ ర్యాంకు అందుకుంది. వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు చూపించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సూచికల పట్టికలో జిల్లాలో ప్రథమంగా నిలవడం హర్షణీయం. 2007 సంవత్సరంలో పులివెందుల మున్సిపాలిటీకి డస్ట్‌బిన్ ఫ్రీ అవార్డు కూడా అందుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా మున్సిపాలిటీల ర్యాంకులను ప్రకటించింది. దేశంలో 4జోన్లుగా విభజించారు. ఇందులో దక్షిణ భారత దేశంలో పులివెందుల మున్సిపాలిటీకి 12వస్థానం కైవసం చేసుకుంది. రాష్ట్రంలోనే 4వ స్థానం కైవసం చేసుకోగా వైఎస్సార్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులివెందుల మున్సిపాలిటీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉత్తమ మున్సిపాలిటీగా పేరొందుతుంది. పులివెందుల మున్సిపాలిటీలో డస్ట్బిన్లు లేకుండా డస్ట్‌బిన్ ఫ్రీ అవార్డు అందుకోవడమే కాకుండా మున్సిపాలిటీలో ఎక్కడ చెత్తచెదారం..కాలువలు లేకుండా యూజీడీ ఏర్పాటు, వీధివీధికి, ప్రతి ప్రాంతంలోను సీసీరోడ్లు ఏర్పాటు చేయడంతో పులివెందులకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకులు సాధించింది. ఇందు కోసం పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు, అధికారులకు మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్సార్ సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ మనోహర్‌రెడ్డి కృషితో.. వైఎస్సార్ సీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి కృషి ఎంతగానో దోహదపడింది. పులివెందుల మున్సిపాలిటీకి శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోయిన తానే శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ప్రతి రోజు ఉదయం ప్రతి వార్డులు తిరుగుతూ ప్రజల కష్టాలు, సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషిచేశారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆయన మాటకు విలువిచ్చి చెప్పిన పనిని శ్రద్ధగా చేయడంతోనే ఆదర్శ మున్సిపాలిటీగా పేరుతెచ్చుకుంది. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి చొరవచూపుతూ రావడంవల్లే జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రజలు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడిన మొదటి నుండే పులివెందుల మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు నిరంతరం పడ్డ శ్రమకు గుర్తింపు లభించింది. దీంతో పురప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పులివెందులకు ఉత్తమ ర్యాంకు
పులివెందుల: దేశవ్యాప్తంగా ఈఏడాది నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2019లో పులివెందుల మున్సిపాలిటీకి అత్యుత్తమ ర్యాంకు అందుకుంది. వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు చూపించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సూచికల పట్టికలో జిల్లాలో ప్రథమంగా నిలవడం హర్షణీయం. 2007 సంవత్సరంలో పులివెందుల మున్సిపాలిటీకి డస్ట్‌బిన్ ఫ్రీ అవార్డు కూడా అందుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా మున్సిపాలిటీల ర్యాంకులను ప్రకటించింది. దేశంలో 4జోన్లుగా విభజించారు. ఇందులో దక్షిణ భారత దేశంలో పులివెందుల మున్సిపాలిటీకి 12వస్థానం కైవసం చేసుకుంది. రాష్ట్రంలోనే 4వ స్థానం కైవసం చేసుకోగా జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులివెందుల మున్సిపాలిటీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉత్తమ మున్సిపాలిటీగా పేరొందుతుంది. పులివెందుల మున్సిపాలిటీలో డస్ట్బిన్లు లేకుండా డస్ట్‌బిన్ ఫ్రీ అవార్డు అందుకోవడమే కాకుండా మున్సిపాలిటీలో ఎక్కడ చెత్తచెదారం..కాలువలు లేకుండా యూజీడీ ఏర్పాటు, వీధివీధికి, ప్రతి ప్రాంతంలోను సీసీరోడ్లు ఏర్పాటు చేయడంతో పులివెందులకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకులు సాధించింది. ఇందు కోసం పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు, అధికారులకు మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్సార్ సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ మనోహర్‌రెడ్డి కృషితో.. వైఎస్సార్ సీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి కృషి ఎంతగానో దోహదపడింది. పులివెందుల మున్సిపాలిటీకి శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోయిన తానే శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ప్రతి రోజు ఉదయం ప్రతి వార్డులు తిరుగుతూ ప్రజల కష్టాలు, సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషిచేశారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆయన మాటకు విలువిచ్చి చెప్పిన పనిని శ్రద్ధగా చేయడంతోనే ఆదర్శ మున్సిపాలిటీగా పేరుతెచ్చుకుంది. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి చొరవచూపుతూ రావడంవల్లే జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రజలు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడిన మొదటి నుండే పులివెందుల మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు నిరంతరం పడ్డ శ్రమకు గుర్తింపు లభించింది. దీంతో పురప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ ఉత్తమం
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షన్–2018లో రాష్ట్రానికి 4 పురస్కారాలు లభించాయి. ఘన వ్యర్థాల నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ రాష్ట్ర రాజధాని నగరంగా హైదరాబాద్ ఎంపికైంది. దక్షిణాదిన అత్యంత పరిశుభ్ర నగరంగా సిద్దిపేటకు పురస్కారం దక్కింది. దేశంలోని 4,203 నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై సర్వే నిర్వహించి రూపొందించిన ‘స్వచ్ఛ సర్వేక్షన్–2018’ ర్యాంకులను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ పురి బుధవారం ఢిల్లీలో ప్రకటించారు. దేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా ఇండోర్ తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, భోపాల్, చండీగఢ్‌లు రెండు, మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. జాతీయ స్థాయిలో పలు అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 23 నగరాలకు పురస్కారాలు ప్రకటించగా, ఘన వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ రాజధాని నగరం కేటగిరీలో హైదరాబాద్‌కు పురస్కారం వరించింది. లక్ష పైన జనాభా ఉన్న నగరాలు, రాజధాని నగరాలను జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపిక చేయగా, లక్ష లోపు జనాభా ఉన్న నగరాలకు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, ఈశాన్య జోన్ల వారీగా కేంద్రం పురస్కారాలు ప్రకటించింది. దక్షిణ జోన్ పరిధిలో నాలుగు పట్టణాలకు పురస్కారాలు వరించగా, అందులో మూడు రాష్ట్రానికి సంబంధించినవే కావడం గమనార్హం. దక్షిణ జోన్ పరిధిలో అత్యంత పరిశుభ్ర నగరంగా సిద్దిపేట, పౌరుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం అత్యుత్తుమ సిటీగా బోడుప్పల్, ఆవిష్కరణలు, ఉత్తమ విధానాల అమల్లో ఉత్తమ నగరంగా పీర్జాదిగూడలు ఎంపికయ్యాయి. -
గ్రేటర్.. ఇండోర్ రూట్
సాక్షి,సిటీబ్యూరో: ఇండోర్ నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు అక్కడి యంత్రాంగం కంకణం కట్టుకుంది. అక్కడ రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరంలో రూ.1.5. కోట్లు వసూలు చేశారంటే ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నగరమంతా రోడ్డుకు ఇరువైపులా ప్రతి 100 మీటర్లకు రెండు చెత్తడబ్బాలు ఏర్పాటు చేశారు. తడి–పొడి చెత్త ఇంటివద్దే వేరు చేయాల్సిందే. దుకాణాలు, హోటళ్లు, తదితర సంస్థల నుంచి ప్రతిరోజు వెలువడే చెత్త పరిమాణాన్ని బట్టి నెలవారీ చెత్త తరలింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అలా తక్కువ చెత్త వెలువడే దుకాణాలకు రూ.500 వసూలు చేస్తుండగా, పెద్ద హోటళ్లకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇళ్ల నుంచి చెత్త తరలించే కార్మికులకు నెలకు రూ.60 చెల్లిస్తున్నారు. చెత్త తరలింపు బండ్లలో తడి,పొడికి వేర్వేరు అరలే కాక నాప్కిన్లకు మరో డబ్బా కూడా ఉంచారు. చెత్త రవాణా కేంద్రాల్లో బయో మెథనైజేషన్ చేస్తున్నారు. ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే సంస్థల నిర్వాహకులతో పాటు కాలనీ సంఘాలు తదితరులకు ఎక్కడికక్కడే సేంద్రియ ఎరువు యంత్రాలను వినియోగించాల్సిందిగా అవగాహన కల్పించారు. రోజుకు పది కేజీల కన్నా ఎక్కువ చెత్త వెలువడే ప్రాంతాల్లో ఈ యంత్రాలను ఉంచారు. పెద్ద హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లలో వీటిని తప్పనిసరి చేశారు. పార్టీ ఇస్తే చార్జి చెల్లించాల్సిందే.. ఏదైనా ఫంక్షన్ హాల్లో గానీ, రోడ్డుపై టెంటు వేసి వేడుక ఏర్పాటు చేసి విందు ఇస్తే ఎంతమంది హాజరు కానున్నారో మనిషికి రూ.50 చొప్పున సదరు పార్టీ నిర్వాహకులు కార్పొరేషన్‌కు ముందుగానే చెల్లించాలి. వ్యర్థాల తరలింపునకు ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఎవరైనా చెల్లించకుంటే పెనాల్టీగా రెట్టింపు చార్జీ వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇండోర్‌లోని స్థానిక ఎమ్మెల్యే ఒకరు ముందస్తు ఫీజు చెల్లించనందుకు అతని నుంచి రూ.50 వేల పెనాల్టీ వసూలు చేశారని అధ్యయనం చేసి వచ్చిన గ్రేటర్ అధికారులు తెలిపారు. అంటే అక్కడ పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నారో తెలుస్తోంది. చెత్త తరలింపు పర్యవేక్షణకు కన్సల్టెన్సీ.. ఇంటింటి నుంచి చెత్త తరలింపు సక్రమంగా జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించేందుకు ఇండోర్ కార్పొరేషన్ ఎన్విరాన్మెంట్ సర్వీసెస్ కన్సల్టెన్సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకుగాను ఒక్కో ఇంటికి నెలకు రూ.11 వంతున కార్పొరేషన్ చెల్లిస్తోంది. అక్కడ సేకరించిన చెత్తను రీసైకిల్ చేసి చెత్తడబ్బాలను తయారు చేశారు. తరిగి ఒక్కో డబ్బాను రూ.25లకు ప్రజలకు విక్రయించారు. టాయ్లెట్ల నిర్వహణ ఇలా.. ఒక్కో టాయ్‌లెట్ నిర్వహణకు ఇండోర్‌లో నెలకు రూ.15 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.7500 కేర్‌టేకర్‌కు చెల్లిస్తుండగా, రూ.7500 నిర్వహణకు వెచ్చిస్తున్నారు. అక్కడ ఔట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకునేది 29 రోజులకే. ఆ ఒప్పందం ముగియగానే వారినే మళ్లీ తాజా ఒప్పందంతో తీసుకుంటారు. రెగ్యులర్ చేయాలనే డిమాండ్లు రాకుండా ఇండోర్‌లో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. గతేడాది స్వచ్ఛ ర్యాంకింగ్‌లో దేశంలోనే నెంబర్–1గా నిలిచిన ఇండోర్‌లో స్వచ్ఛ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నారో పరిశీలించేందుకు జీహెచ్ఎంసీకి చెందిన అధికారులు ఇప్పటికే అక్కడ పర్యటించి వచ్చారు. వారు అధ్యయనం చేసిన వివరాలను ‘సాక్షి’కి వివరించారు. అధ్యయనం చేసి వచ్చిన వారిలో జోనల్ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, శంకరయ్య, హరిచందన, భారతి హొళికేరి, అడిషనల్ కమిషనర్ మనోహర్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, శశికిరణాచారి తదితరులు ఉన్నారు. వారు తమ అధ్యయన నివేదికను కమిషనర్‌కు అందజేయనున్నారు. వాటిలో నగరానికి అనువైన వాటిని త్వరలో అమలు చేయనున్నారు. స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ.. ఇండోర్ కార్పొరేషన్ జనాభా 35 లక్షలు. విస్తీర్ణం 150 చ.కి.మీ. కమిషనర్‌తో పాటు నలుగురు అడిషనల్ కమిషనర్లు స్వచ్ఛ కార్యక్రమాలపైనే ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని జోనల్ కమిషనర్ శంకరయ్య తెలిపారు. గతేడాది నెంబర్–1గా నిలవడంతో దాన్ని తిరిగి నిలుపుకుందామంటూ ఎక్కడ చూసినా ‘ఫిర్ రహేంగే’ ప్రకటనలు కనిపిస్తున్నాయని సీసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. -
హలో.. నేను మీ ప్రియమైన హరీశ్‌ను..!
సిద్దిపేటజోన్: స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వినూత్న పంథాను ఎంచుకున్నారు. తన వాయిస్‌తో కూడిన సందేశాన్ని పట్టణ ప్రజలకు ఫోన్ ద్వారా వినిపించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ‘నమస్కారం.. నేను మీ ప్రియమైన హరీశ్‌రావును మాట్లాడుతున్నాను. ఈ ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మన సిద్దిపేట పట్టణం పోటీలో ఉంది. మన పట్టణాన్ని మీ సహకారంతో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణం (ఓడీఎఫ్)గా చేసుకుని ఇప్పటికే ఆదర్శంగా నిలిచాం. ఇక, మీ భాగస్వామ్యంతో ఇంటింటికి చెత్త సేకరణ, దాని నిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. హరితహారంలో ముందున్నాం. వీటిని మరింత విజయవంతం చేయడంలో మీ సహకారం ఎంతో అవసరం. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొని మన సిద్దిపేట పట్టణాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’అని సందేశం వినిపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ‘040’కోడ్‌తో వచ్చే ఈ కాల్ పట్టణంలోని అందరికీ చేరుతోంది. ఫోన్ ఎత్తగానే మంత్రి గొంతుతో కూడిన సందేశం వినిపిస్తుంది. ‘ఈ మహా యజ్ఞంలో మీరు భాగస్వామ్యం కావడానికి 1969 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. లేదా స్వచ్చ సర్వేక్షణ్ 2018 వెబ్‌కు లాగిన్ అయ్యి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి’అంటూ మంత్రి సందేశం ముగుస్తుంది. అయితే.. ఇప్పుడు పట్టణంలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. సిద్దిపేటకు ర్యాంకు ఇవ్వడానికి బుధవారం నుంచి మూడు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ బృందం ప్రజలను కూడా కలుస్తుందని, చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై బృందం సభ్యులు వివిధ ప్రశ్నలు వేస్తారని, వాటికి తదనుగుణంగా సమాధానాలు ఇవ్వాలని మంత్రి ఆ సందేశంలో వినిపిస్తున్నారు. -
ర్యాంక్ నంబర్ 19
► స్వచ్ఛ సర్వేక్షణ్–2017లో విజయవాడకు 1,624 మార్కులు ► జాతీయ స్థాయిలో 19వ స్థానం కైవసం ► ఢిల్లీలో అవార్డు అందుకున్న మేయర్, కమిషనర్లు విజయవాడ సెంట్రల్ : స్వచ్ఛ సర్వేక్షణ్–2017 అవార్డును కైవసం చేసుకున్న విజయవాడ టాప్–10లో చోటు పొందలేకపోయింది. దక్షిణాదిలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు సాధించి 19వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ర్యాంక్‌ను పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో 2,000 మార్కులకు 1,624 సాధించింది. ఈ మేరకు ఢిల్లీలో గురువారం జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్–2017 అవార్డును కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు నుంచి మేయర్ కోనేరు శ్రీధర్, ఇన్చార్జి కమిషనర్ డి.చంద్రశేఖర్, మాజీ కమిషనర్ జి.వీరపాండియన్ అందుకున్నారు. పోటాపోటీగా... స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్, అవార్డు కోసం దేశవ్యాప్తంగా 500 నగరాలు పోటీపడ్డాయి. వాటిలో 38 నగరాలు అవార్డుకు ఎంపికయ్యాయి. ర్యాంకింగ్‌లో విజయవాడ 19 స్థానంలో నిలిచింది. గత ఏడాది 23వ ర్యాంక్‌లో నిలిచిన నగరం ఈసారి మెరుగైన ఫలితాన్ని నమోదు చేసు కుంది. అయితే టాప్–10లో చోటు లభిస్తుందన్న అధికారులు, పాలకులు అంచనాలు తారుమారయ్యాయి. గ్రేటర్ విశాఖ జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్, తిరుపతి 9వ ర్యాంక్ పొందాయి. మరో 64 మార్కులు వచ్చి ఉంటే... విజయవాడ నగరానికి టాప్–10లో చోటు దక్కకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. వీటిలో శాశ్వత డంపింగ్ యార్డు లేకపోవడం ముఖ్యమైనది. కమ్యూనిటీ టాయ్‌లెట్స్ విషయంలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం సభ్యులు క్షేత్రస్థాయి పరిశీలనలో సంతృప్తి చెందలేదు. ఆ ప్రభావం మార్కులపై పడింది. మొత్తం 2,000 మార్కులకు 1,624 మార్కులు దక్కాయి. మరో 64 మార్కులు వచ్చి ఉంటే టాప్–10లో చోటు దక్కేదని అధికారులు తెలిపారు. మార్కులు ఇలా... మొత్తం 34 అంశాలకు సంబంధించి రూపొందించిన డాక్యుమెంట్లు, ఫొటోలకు 900 మార్కులు కేటాయించగా, 799 లభించాయి. క్షేత్రస్థాయి పరిశీలనకు 500 మార్కులు కాగా, 406 వచ్చాయి. సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌కు 600 మార్కులు కాగా, 419 మార్కులు వచ్చాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల హర్షం స్వచ్ఛ సర్వేక్షణ్ రావడంపై నగరపాలక సంస్థ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. టాప్–10లో చోటు లభించకపోయినా, మంచి ర్యాంకునే సాధించామని నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ అభిప్రాయపడ్డారు. కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ మౌలిక వసతుల కల్పనలో శాయశక్తులా కృషి చేశామన్నారు. సైంటిఫిక్ డంపింగ్ యార్డు ఉన్నట్లయితే ఫలితం మరోలా ఉండేదన్నారు. నగరపాలక సంస్థకు అవార్డు దక్కడం ఆనందంగా ఉందని ఇన్చార్జి కమిషనర్ డి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరింత మెరుగైన ర్యాంక్ జాతీయ స్థాయిలో విజయవాడకు గుర్తింపు రావడం సంతోషంగా ఉందని మేయర్ కోనేరు శ్రీధర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన ర్యాంక్ సాధిస్తామని ఆయన చెప్పారు. ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది సహకారం వల్లే జాతీయ స్థాయిలో 19వ ర్యాంక్ దక్కిందన్నారు. అధికారులు, సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. -
స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులకు ఆరు నగరాలు
అమరావతి: స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులకు ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు నగరాలు ఎంపికయ్యాయి. 2017 సంవత్సరానికి సర్వేక్షణ్ అవార్డుల కోసం కేంద్రం పలు నగరాలను ఎంపిక చేసింది. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, ఒంగోలు, తాడిపత్రి నగరాలను ఇందుకు ఎంపిక చేశారు. ఆ అవార్డులను కేంద్ర ప్రభుత్వం మే 4న ప్రదానం చేయనుంది.