బాలికలపై వివక్ష చూపొద్దు
బాలికలపై వివక్ష చూపొద్దు
Published Sat, Oct 29 2016 6:52 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
- పోషణ భారంగా ఉంటే పోలీసులకు ఇవ్వండి
– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ
కర్నూలు సీక్యాంప్: బాలికలపై వివక్ష చూపొద్దని, పోషణ భారంగా ఉంటే పోలీసులకు ఇవ్వాలని తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. శనివారం కోరమండల్ ఇంటర్నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గ్రామీణ బాలికల పురస్కార కార్యక్రమం కర్నూలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 100 మంది బాలికలకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చారు. ముఖ్యఅతిథిగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆడపిల్లలు తల్లి కడుపులో నుంచి రావడాని, వచ్చాక సమాజంలో బతకడానికి యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో బాలికలే అగ్రభాగంలో ఉన్నారన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని కోరారు. కప్పట్రాళ గ్రామంలో బాలికలు 100 శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పుకొచ్చారు. వజ్రాల్లాంటి అమ్మాయిల తెలివితేటల్ని తల్లిదండ్రులు చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ప్రతీ రంగంలో అగ్రస్థానంలో ఉన్నారని జేడీఎ ఉమామహేశ్వరమ్మ అన్నారు. కార్యక్రమంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ ఫర్టిలైజర్ ఉద్యోగులు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Advertisement