శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఇనగలూరు వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆటో బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.