యాచారం, న్యూస్‌లైన్: పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) చెర్మన్లకు చెక్ పవర్ వచ్చింది. ఈమేరకు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎస్‌ఎంసీ చైర్మన్లతో కూడిన జాయింట్ అకౌంట్‌ను తెరవాలని రాజీవ్ విద్యామిషన్ అధికారులు ఇటీవల అదేశాలు జారీచేశారు. పాఠశాల నిధుల నిర్వహణ, నూతన భవనాల నిర్మాణం తదితర అంశాలల్లో ఆర్థికపరమైన నిధుల్లో పాఠశాల హెచ్‌ఎంలతోపాటు ఎస్‌ఎంసీ చైర్మన్లు కీలకం కానున్నారు. గత ఏడాది వరకు ఈ నిధులపై పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్లకు ఎలాంటి అధికారం లేదు. కేవలం నామమాత్రంగానే ఈ పదవులు ఉండేవి.
మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు 51 వరకు ఉన్నాయి. దాదాపు ఆరు వేల మంది విద్యార్థుల వరకు విద్యనభ్యసిస్తున్నారు. అన్ని పాఠశాల్లో ఎస్‌ఎంసీ కమిటీ చెర్మన్లను ఎన్నుకున్నారు. ప్రభుత్వం నుంచి పాఠశాలలకు ప్రతి సంవత్సరం ఆర్వీఎం నుంచి ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. ఇందులో ఉన్నత పాఠశాలకు గ్రాంటు కింద రూ. 7వేలు, నిర్వాహణ కోసం రూ. 10 వేలు, ప్రాథమిక పాఠశాల గ్రాంట్, నిర్వాహణకు రూ.10వేలు మంజూరవుతాయి. వీటితోపాటు ప్రత్యేకంగా క్లస్టర్ పాఠశాలలకు అదనంగా నిధులు మంజూరవుతాయి.
వివిధ పథకాల కింద ప్రతి పాఠశాలకు రూ. 10 నుంచి 20 వేల వరకు సాధారణ నిధులు మంజూరు కావడంతో పాటు రూ. లక్షల్లో అభివృద్ధి నిధులు కూడా మంజూరవుతాయి. గతేడాది వరకు పాఠశాలకు నిధులను డ్రా చేయటానికి హెచ్‌ఎంతో పాటు ఆదే పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడికి జాయింట్ చెక్ పవర్ ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయమై మండల విద్యాధికారి మాధవరెడ్డిని ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా ఎస్‌ఎంసీ చెర్మన్లకు జాయింట్ చెక్‌పవర్ గురించి రాజీవ్ విద్యామిషన్ నుంచి ఆదేశాలు వచ్చింది వాస్తవమేన న్నారు.
ఎస్‌ఎంసీ చైర్మన్లకు చెక్ పవర్
Published Tue, Aug 27 2013 3:41 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement