సొసైటీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ హవా | Society elections for the YSRCP strong | Sakshi
Sakshi News home page

సొసైటీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ హవా

Published Mon, Dec 30 2013 3:13 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

Society elections for the YSRCP strong

సాక్షి, కడప : వివిధ కారణాలతో వాయిదా పడిన సొసైటీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ సత్తా చాటింది. జిల్లావ్యాప్తంగా 21 సొసైటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 12 సొసైటీలు నామినేషన్ల దశలో ఆగిపోగా, 8 సొసైటీలు పోలింగ్ దశలో ఆగిపోయాయి.  ఓటర్ల జాబితా ప్రచురణ నోటిఫికేషన్ వెలువడకుండానే బ్రాహ్మణపల్లె సొసైటీ ఎన్నిక ఆగిపోయింది. నామినేషన్ల దశలో ఆగిపోయిన 12 సొసైటీలలో నామినేషన్ల ఉపసంహరణ ఆదివారం సాయంత్రంతో ముగిసింది.

 ఏడు స్థానాలను  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు  ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు.   అనంతయ్యగారిపల్లె 13 డెరైక్టర్ స్థానాలు, అనంతసముద్రం 13, పెనగలూరు 7, బి.కోడూరు 10, చిన్నకేశంపల్లె 9, కొలిమివాండ్లపల్లె 9, మద్దిరేవుల వైఎస్‌ఆర్‌సీపీ 8, కాంగ్రెస్ 5 డెరైక్టర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ డెరైక్టర్ స్థానాలన్నింటినీ వైఎస్‌ఆర్‌సీపీ అనుకూల అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో ఈ ఏడు సొసైటీల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులే ఛైర్మన్లుగా ఎన్నిక కానున్నారు. గొర్లముదివీడు సొసైటీలో 13 డెరైక్టర్ స్థానాలు ఏకగ్రీవం కాగా ఛైర్మన్‌గా స్వతంత్య్ర అభ్యర్థి ఎన్నిక కానున్నారు. నందలూరులో 12 స్థానాలకు, మట్లిలో 13 స్థానాలకు, వీరబల్లిలో అన్ని స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  బ్రాహ్మణపల్లె సొసైటీకి ఫిబ్రవరి 2న ఎన్నిక జరుగనుంది. మిగిలిన స్థానాలకు జనవరి 5వ తేదీన పోలింగ్ జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement