హైదరాబాద్: స్నేహితురాలి పెళ్లికి అడ్డు రావడమే కాకుండా తననే పెళ్లి చేసుకోవాలని మెయిల్స్ పంపించి హింసిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఏసీపీ ప్రతాప్‌రెడ్డి కథనం మేరకు...సనత్‌నగర్‌కు చెందిన కోటేశ్వరరావు ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తోటి స్నేహితురాలు కూడా అదే కంపెనీలో పనిచేస్తుంది. తనను పెళ్లి చేసుకోవాలని కోటేశ్వరరావుకోరడంతో ఆమె నిరాకరించింది.
దీంతో కక్ష కట్టిన అతను ఆమె పేరుతో నకలిలీ ఫేస్‌బుక్ తెరిచి అందులోంచి పలువురికి అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు పంపిచాడు. ఆమెకు వస్తున్న పెళ్లి సంబంధాలను కూడా కావాలని చెడగొట్టాడు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా మెసేజ్‌లు పంపించి వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ కె.సుదర్శన్‌రెడ్డి, ఎస్‌ఐ ఎస్.రాఘవేందర్‌రెడ్డిలు ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.