హైదరాబాద్ : కాంగ్రెస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్సీలు తెలుగు దేశం పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చి ఎనిమిది మంది ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు.
ఆ విషయాన్ని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ అంగీకరించారన్నారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యనమల హెచ్చరించారు. త్వరలోనే మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి నోటిఫికేషన్ ఇస్తామని ఆయన తెలిపారు.