బిల్లుపై చర్చకు ఇంకా గడువు కావాలి
-
రాష్ట్రపతికి సీఎం కిరణ్ తాజా లేఖ
-
బిల్లును తిరస్కరించాలి అంటూనే..
-
చర్చ కోసం మరింత గడువు కోరిన ముఖ్యమంత్రి
-
కిరణ్ వైఖరిపై నేతల్లో విస్మయం..
-
మరో మూడు వారాల గడువు పొడిగించాలని కోరా..
-
పూర్తి సమాచారంతో కూడిన బిల్లునూ పంపాలన్నా
-
‘ముసాయిదా’ అయితే రాష్ట్రపతి అలా చెప్పలేదేం? పార్లమెంటుకు పంపే బిల్లునే అసెంబ్లీకి పంపించాలి: సీఎం
-
బిల్లులో లోపాల గురించి కానీ, ఒరిజినల్ బిల్లు పంపాలని కానీ గడువు కోసం రాష్ట్రపతికి రాసిన లేఖలో చెప్పని కిరణ్
-
గడువు పెంపు కోరుతూ ‘సీఎల్‌పీ’ తరఫున పలువురు మంత్రులతో రాష్ట్రపతికి మరో లేఖ పంపించిన వైనం
-
తెలంగాణ మంత్రులతో సంప్రదించకుండా సీఎల్‌పీ తరఫున లేఖ ఎలా పంపుతారంటూ టీ-మంత్రుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో సాంకేతిక లోపాలు ఉన్నాయని, దాన్ని తిరస్కరిస్తూ తీర్మానం ప్రవేశపెట్టటానికి అనుమతించాలని.. అసెంబ్లీ నిబంధన 77 కింద స్పీకర్‌కు నోటీసు ఇచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. మరోవైపు అదే బిల్లుపై చర్చించడానికి గడువు మరింత పొడిగించాలని కోరుతూ రాష్ట్రపతికి తాజాగా మరో లేఖ రాశారు. విభజన బిల్లుపై చర్చకు మరో మూడు వారాల గడువు పొడి గించాలని ఆ లేఖలో కోరారు. సీఎం ద్వంద్వ వైఖరిపై సీమాంధ్ర నేతలతో పాటు, తెలంగాణ నేతల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బిల్లుపై చర్చకు మరో మూడు వారాల గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి స్వయంగా తెలిపారు. ఆయన మంగళవారం శాసనసభ నుంచి వెళ్లిపోతూ తన చాంబర్ బయట మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పూర్తి సమాచారంతో కూడిన బిల్లును పంపాలని కూడా రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు. ‘‘అసెంబ్లీకి నకిలీ బిల్లు కాకుండా అసలు బిల్లే రావాలి. అందులో అన్ని అంశాలూ పూర్తిగా ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు.
వారు రాజ్యాంగం చదువుకోవాలి...
ఏ బిల్లు అరుునా వుుందుగా వుుసారుుదాగానే ఉంటుందని, పార్లమెంటు ఆమోదం తరువాతే అది పూర్తి బిల్లు, చట్టం అవుతుందని కేంద్ర వుంత్రి జైరాంరమేష్ పేర్కొన్నారని విలేకరులు గుర్తుచేయుగా.. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో ఏవుుందో వారే చదువుకోవాలి. ఏదీ చదవకుండా వూట్లాడితే ఎలా?’’ అని సీఎం స్పందించారు. ‘‘ఈ బిల్లు వుుసారుుదానే అరుుతే రాష్ట్రపతి ‘వుుసారుుదా’ అని కాకుండా ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు’ అని పంపారెందుకు?’’ అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు ఆమోదానికి ఏ బిల్లు పెడతారో దాన్నే రాష్ట్రపతికి పంపాలని, అదే అసెంబ్లీకి వస్తే చర్చించటానికి వీలవుతుందని పేర్కొన్నారు. బిల్లులో సవుగ్రంగా అన్ని స్టేట్‌మెంట్లు, వివరాలు ఉండాలన్నారు. తాజా బిల్లుపై చర్చకోసం రాష్ట్రపతిని అదనపు సవుయుం కోరుతూ లేఖ రాశావున్నారు. అరుుతే.. బిల్లు అసవుగ్రంగా ఉందని, నకిలీ బిల్లు కాకుండా ఒరిజినల్ బిల్లు పంపాలని సభ లోపలా వెలుపలా చెప్తున్న సీఎం కిరణ్.. రాష్ట్రపతికి రాసిన లేఖలో ఈ విషయాలు పేర్కొనకపోవటం విశేషం. అదనపు సమయం కావాలని మాత్రమే ఆయన తన లేఖలో కోరారు.
సీఎల్పీ తరఫున సీమాంధ్ర మంత్రుల లేఖ
ఇదిలావుంటే.. బిల్లుపై చర్చ కోసం అదనపు సవుయుం కోసం పలువురు సీమాంధ్ర వుంత్రులతో కాంగ్రెస్ శాసనసభాపక్షం తరఫున రాష్ట్రపతికి వురో లేఖ రారుుంచారు. ఇప్పటివరకు సభలో 80 వుంది వూత్రమే అభిప్రాయూలు చెప్పేందుకు అవకాశం దొరకి ందని, ఇంకా 200 వుంది సభ్యులు వూట్లాడాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. సభ సజావుగా సాగనందున సభ్యులకు అభిప్రాయూలు చెప్పే అవకాశం రాలేదన్నారు. బిల్లుపై సభ్యుల నుంచి 9,024 సవరణలు అందాయుని, వీటిపైనా సవివర చర్చ సాగాల్సి ఉందన్నారు. ఈ లేఖపై వుంత్రులు ఆనం రావునారాయుణరెడ్డి, రఘువీరారెడ్డి, వట్టి వసంతకువూర్, పితాని సత్యనారాయుణ, అహ్మదుల్లాలు సంతకాలు చేశారు.
టీ-మంత్రుల ఆగ్రహం.. లేఖ పంపేందుకు సిద్ధం
అయితే.. తెలంగాణ నేతలతో సంప్రదించకుండా కాంగ్రెస్ శాసనసభాపక్షం తర ఫున లేఖను ఎలా పంపిస్తారంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఇందుకు ప్రతిగా అదనపు సవుయుం ఇవ్వరాదంటూ అదే సీఎల్‌పీ ద్వారా తావుూ లేఖ పంపేందుకు సిద్ధవువుతున్నారు.