సోనియా డెరైక్షన్‌లో కిరణ్ డ్రామా ! | Sonia deraiksanlo her drama! | Sakshi
Sakshi News home page

సోనియా డెరైక్షన్‌లో కిరణ్ డ్రామా !

Published Fri, Dec 20 2013 4:31 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Sonia deraiksanlo her drama!

=కొనసాగుతున్న సమైక్య నిరసనలు
 =ముఖ్యమంత్రి తీరుపై మండిపాటు
 
తిరుపతి, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లు అంశంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ డెరైక్షన్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి డ్రామాలాడుతున్నారని సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య ముసుగులో ముఖ్యమంత్రి విభజన నాటకాన్ని తెలివిగా రక్తికట్టిస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో కాకుండా మండలిలో టి.బిల్లుపై చర్చకు సమ్మతమేనన్న సంకేతాలు ఇవ్వడం ఎంతవరకు సబబని మండిపడ్డారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గురువారం జిల్లాలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.

పుంగనూరులో ఉద్యోగ జేఏసీ వరదారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు స్థానిక గోకుల్ సర్కిల్‌లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి విభజనకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బయట సమైక్యరాగం ఆలపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు.

మదనపల్లెలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక గిరిరావ్ థియోసాఫికల్ హైస్కూల్ విద్యార్థులు సమైక్య నినాదాలతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి మల్లికార్జున సర్కిల్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రసంగిస్తూ కాంగ్రెస్‌కు సీమాంధ్ర ప్రజలు ఉసురు తగిలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. పలమనేరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్ రిలే దీక్షలు కొనసాగారుు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement