రాష్ట్ర ప్రజలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిలోనూ సందేశం ఉందన్నారు.
ఆ స్ఫూర్తితో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.