
‘కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు’
గుంటూరు : ప్రత్యేక హోదాకు మించిన ఆదాయ వనరులు ఆంధ్రప్రదేశ్కు వస్తాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ చట్టంలో ఉన్నవి అమలు చేసి వాటికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ప్రత్యేక హోదాపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని వెంకయ్య మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో నాడు రాష్ట్ర ప్రయోజనాలపై నోరు మెదపని వారు ఈరోజు తనను విమర్శిస్తున్నారని వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు.
ఏడు మండలాలను ఏపీలో కలపకపోతే పోలవరం సాధ్యమయ్యేదా అని ఆయన ప్రశ్నించారు. తెనాలిలో ఇవాళ జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వెంకయ్య పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయనకు బీజేపీ నేతల సన్మానం చేశారు.