కర్నూలు: బెల్ట్ దుకాణాల నిర్మూలనపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఏ ప్రాంతంలో బెల్ట్ దుకాణాలు ఉంటే ఆ ప్రాంత అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ కమిషనర్ ఎస్.ఎస్.రావత్ హెచ్చరించిన నేపథ్యంలో రెండు రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బెల్టు షాపులపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హెప్సిబా రాణి ఆదేశాల మేరకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కర్నూలు యూనిట్ సిబ్బంది శుక్రవారం నందికొట్కూరు, కర్నూలు, పత్తికొండ, కోడుమూరు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా దాడులు నిర్వహించి 65 లీటర్ల నాటుసారా, 95 లిక్కర్ బాటిళ్లు, 5 బీర్లు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నందికొట్కూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురంలో సోదాలు నిర్వహించి బెల్ట్ దుకాణం నిర్వాహకుడు ఈడిగ లక్ష్మన్న గౌడ్, కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నీలిషికారి గాయత్రి నుంచి 10 లీటర్ల నాటుసారా, బుధవారపేటలోని బోయ లక్ష్మీదేవి, బోయ సుంకులమ్మ, బోయ రాజుల నుంచి ఒక్కొక్కరి వద్ద 15 లీటర్ల చొప్పున నాటు సారా స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు.
పత్తికొండ స్టేషన్ పరిధిలోని హెచ్.కైరవాడి లో బెల్ట్ షాపు నిర్వాహకుడు కటిక హుసేన్ నుంచి 22 మద్యం క్వార్టర్ బాటిళ్లు, కోడుమూరు స్టేషన్ పరిధిలోని సంగాల గ్రామంలో బోయ రాముడు వద్ద 40 క్వార్టర్ బాటిళ్లు, పలుకుదొడ్డి గ్రామంలో ఈడిగ మద్దిలేటి నుంచి 18 క్వార్టర్ బాటిళ్లు, 8 బీర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు రాముడు, సుధాకర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు నారాయణ, కృష్ణారెడ్డి, రాజశేఖర్, ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.
‘బెల్ట్’ తీశారు..
Published Sat, Jul 19 2014 1:16 AM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM
Advertisement
Advertisement