
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్‌చార్జి పీఆర్వో కె.రాజేంద్రప్రసాద్ ఓప్రకటనలో తెలిపారు.
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్‌చార్జి పీఆర్వో కె.రాజేంద్రప్రసాద్ సోమవారం ఓప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07053) జూన్ 21వ తేదీ రాత్రి 7.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది.
కాకినాడ టౌన్–సికింద్రాబాద్ రైలు (07054) జూన్ 23వ తేదీ రాత్రి 8.45కు కాకినాడ టౌన్‌లో బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్ రైలు (07025) జూన్ 18వ తేదీ మధ్యాహ్నాం 2.30 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్– శ్రీకాకుళం రోడ్ రైలు (07026) జూన్ 17వ తేదీ రాత్రి 7.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది.