విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు | Special Trains From Secunderabad to Kakinada | Sakshi
Sakshi News home page

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

Published Thu, Oct 10 2019 8:15 AM | Last Updated on Thu, Oct 10 2019 8:21 AM

Special Trains From Secunderabad to Kakinada - Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ పీఆర్వో నుశ్రత్‌.ఎం.మండ్రూప్‌కర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు (07053) సికింద్రాబాద్‌ – కాకినాడటౌన్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 11వ తేదీ రాత్రి 9.40కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.40కు కాకినాడటౌన్‌  చేరుతుంది. రైలునెంబరు (07054)  కాకినాడటౌన్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 13వ తేదీ రాత్రి 8 గంటలకు కాకినాడటౌన్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.40కు సికింద్రాబాద్‌ చేరుతుంది. రైలునెంబరు (07255) నరసాపూర్‌– సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 10,12వ తేదీలలో రాత్రి 6 గంటలకు నరసాపూర్‌లో బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్‌  చేరుతుంది.

రైలునెంబరు (07256) సికింద్రాబాద్‌–నరసాపూర్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 11వ తేదీ రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.05కు నరసాపూర్‌ చేరుతుంది. రైలునెంబరు(07255) నరసాపూర్‌ – సికింద్రాబాద్‌  ప్రత్యేకరైలు అక్టోబర్‌ 13వ తేదీ రాత్రి 8.50కు నరసాపూర్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.50కు సికింద్రాబాద్‌ చేరుతుంది. ఈ ప్రత్యేకరైళ్లు విజయవాడ మీదుగా రాక, పోకలు సాగిస్తాయని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీఆర్వో తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement