
శ్రీవారి సన్నిధిలో సినీతార శ్రీదేవి
ప్రముఖ సినీనటి శ్రీదేవి గురువారం తిరుమలవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రాత్రి నైవేద్య విరామ సమయంలో శ్రీదేవి తన చిన్న కుమార్తె ఖుషి కపూర్, సోదరి మహేశ్వరితో కలిసి వైకుంఠం క్యూ ద్వారా ఆలయంలోకి వెళ్లారు.
ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని అనంతరం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సినీనటి కావటంతో ఆలయం వెలుపల శ్రీదేవిని చూడటానికి భక్తులు పోటీపడ్డారు.
- తిరుమల