శ్రీకాకుళం అబ్బాయి, జపాన్ అమ్మాయి | srikakulam Man Marry an Japani girl | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం అబ్బాయి, జపాన్ అమ్మాయి

Published Sat, Dec 6 2014 8:11 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

శ్రీకాకుళం అబ్బాయి, జపాన్ అమ్మాయి

శ్రీకాకుళం అబ్బాయి, జపాన్ అమ్మాయి

  • ఒక్కటి చేసిన ప్రేమ
  • ఈనెల 3వ తేదీన వివాహం
  • అప్పన్నకు పూజలు
  • సింహాచలం : విశాఖలో ఈనెల 3వ తేదీన వివాహం చేసుకున్న ఇండియా అబ్బాయి మోహన్ వంశీ దుంగా, జపాన్ అమ్మాయి అసాకొ తోడా శుక్రవారం వరాహ లక్ష్మీనృసింహస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామికి పూజలు నిర్వహించారు.

    శ్రీకాకుళం జిల్లా దరివాడకి చెందిన మోహన్ వంశీ దుంగాకు, జపాన్‌కి చెందిన అసాకొ తోడాకి యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎంఎస్ చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.

    ఇరువర్గాల పెద్దల అంగీకారంతో ఈనెల 3న వారు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిరువురూ యుఎస్‌ఏలో ఉద్యోగం చేస్తున్నారు. వరుడు తండ్రి మల్లేశ్వరరావు గంగవరం పోర్టు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement