
అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న నారువ గ్రామస్తులు
శ్రీకాకుళం,రణస్థలం: శరీరంలో ఆకస్మికంగా కాళ్లు, చేతులు, మొఖం వాపు రావడంతోపాటు నొప్పులు తీవ్రతరంగా కావడంతో మండలంలోని పారిశ్రామిక ప్రాంతం నారువ గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ గ్రామంలో శుక్ర, శని, ఆదివారాలు ఈ పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే శ్రీకాకుళం రిమ్స్, విజయనగరం గోషా ఆసుపత్రి, ఇతర ప్రైయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నా రు. నిద్రబంగి రాము, అసిరమ్మ, ఆదిలక్ష్మి, కురమ్మ, గురమ్మ, సీతారాములు, అసిరయ్య, గండ్రేడ్డి కుమారి నీలాపు రాములమ్మ, సీతమ్మ, చిన్న, కాటికోని కురమయ్య, తదితర 50 మందికిపైగా గ్రామంలో ఇలా అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. పరిశ్రమల కాలుష్యం వల్లే తాగునీరు పూర్తిగా కలుషితమై ఇలా రోగం బారినపడ్డారని గ్రామ టీడీపీ నాయకులు జీరు గురునాథరెడ్డి చెబుతున్నారు. దీనిపై స్థానిక ఏఎన్‌ఎంకు సమాచారం ఇచ్చినా వైద్యాధికారులు రాలేదని సమాధానమిచ్చారు. దీనిపై పాతర్లపల్లి వైద్యుడు కృష్ణచైతన్యను వివరణ కోరగా సోమవారం వైద్య శిబిరం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment