సాక్షి ప్రతినిధి, నెల్లూరు : కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం టికెట్ విషయమై పార్టీ అధినేత చంద్రబాబు నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే ఆ టికెట్‌ను ఆశిస్తున్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని ఎలాగైనా ఒప్పించుకునే బాధ్యత పోలంరెడ్డిపైనే బాబు ఉంచినట్లు తెలిసింది. దీంతో రెండు రోజు లుగా పోలంరెడ్డి పెళ్లకూరుతో సయోధ్యకు యత్నాలు ప్రారంభించారు. ముం దుగా శుక్రవారం పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మరి కొందరు ముఖ్య నేతలతో కలిసి నగరంలోని మాగుంట లేఅవుట్‌లో గల పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఇంటికి వెళ్లడమే కాకుండా ఆయనతో సయోధ్య కోసం సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. అయితే తాను తన అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడనిదే ఏ విషయం చెప్పలేనని పెళ్లకూరు తేల్చి చెప్పడంతో తిరిగి శనివారం రెండోదఫా చర్చలకు సిద్ధమయ్యారు. అయితే ఈ సారి వేదిక ఇనమడుగుకు మారింది.
పెళ్లకూరును ఎలాగైనా ఒప్పించి అనుకూలంగా మలుచుకునేందుకు పోలంరెడ్డి వి శ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అం దుకు పెళ్లకూరు అనుచరులు ససేమిరా అనడంతో పాటు పెద్ద గొడ వ కూడా జరిగింది. ఎట్టి పరి స్థితుల్లోనూ తాము పోలంరెడ్డికి మద్దతిచ్చేది లేదని కార్యకర్తలు అడ్డు తగడలడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో సమావేశం నుంచి పెళ్లకూరు అర్ధాం తరంగా నిష్ర్కమించినట్టు తెలిసింది.
బాబ్బాబు..ఒప్పుకో!
Published Sun, Mar 16 2014 3:02 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement