srinivasullu reddy
-
పాత పనులు..కొత్త బిల్లులు
కోవూరు చెరువులో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 600 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు మట్టిని పెద్దఎత్తున కొల్లగొట్టారు. చిన్న, సన్నకారు రైతులు మట్టిని అడిగినా ఇవ్వకుండా అధికారపార్టీ నాయకుల పొలాలకు తరలించుకున్నారు. ఎమ్మెల్యే సైతం తన పొలానికి చెరువు మట్టిని తరలించుకున్నట్లు స్థానికులు ఆరోపించారు. కలువాయి మండలంలో రెండో విడతల కింద వెరుబొట్లపల్లి, తిరుమలపాడు, పర్లకొండ, తెలుగురాయపురం, చవటపల్లి చెరువులకు రూ.22.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ చెరువుల్లో గతంలో పూడికతీసిన చోట మేకప్ వేసి దానిని కొత్తగా చేసినట్లు రికార్డులు సృష్టించారు. పూడిక తీసిన చోట మట్టిని తమకు అనుకూలమైన వారు మాత్రమే తోలుకునేలా కాంట్రాక్టర్లు షరతులు విధించారు. ఠ ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో కొండాపురం, కలిగిరి, వరికుంటపాడు మండలాల పరిధిలో ఎమ్మెల్యే బంధువులు, అనుచరులు నీరు-చెట్టు పనుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. గతంలో చేపట్టిన పనుల్లో టీడీపీ నేతలు పైపైన పనులు చేసి పెద్దఎత్తున నిధులు కాజేసేందుకు పధకం రచించారు. అందులో భాగంగా పాతగుంతలకన్నింటికీ కొత్తగా బిల్లులు పెట్టినట్లు సమాచారం. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోనే మొత్తం రూ.కోటి వరకు అవినీతి జరిగిందని అంచనా. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ సర్కారు చేపట్టిన నీరు-చెట్టు పథకం ఆ పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ నిధులు స్వాహా చేయటంలో తమకు మించిన వారు లేరని నిరూపించుకుంటున్నారు. గతంలో ఉపాధిహామీ కింద చెరువుల్లో పూడికతీసిన గుంతలకు ఇప్పుడు తవ్వినట్లు బిల్లులు చేసుకుంటున్నారు. అదేవిధంగా కాలువల్లో పూడికతీయకనే.. గుర్రపుడెక్కలు తొలగించకనే తమ్ముళ్లు నిధులు ఆరగిస్తున్నారు. అవినీతి అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు కొందరు చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటే... మరికొందరు వారితో కుమ్ముక్కై జేబులు నింపుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ.. భూగర్భజలాల అభివృద్ధి కోసం ‘నీరు-చెట్టు’ పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడతలో జిల్లాలో రూ.40.01 కోట్లతో 5,202 పనులను చేపట్టింది. జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు, కాలువలను పూడికతీసి ఆ మట్టిన రైతుల వ్యవసాయ భూములకు తరలించాల్సి ఉంది.ఆ పనులన్నింటినీ టీడీపీ నేతలే చేస్తున్నారు. జిల్లాలో చేపట్టిన పనుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులకు రహస్య నివేదిక పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ నివేదికలోని అంశాలు మచ్చుకొన్ని... అక్కడ తమ్ముళ్ల ఇష్టారాజ్యం టీడీపీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న కోవూరు, వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో తమ్ముళ్ల ఇష్టారాజ్యంగా పనులు జరుగుతున్నాయి. కొడవలూరు మండలంలో రూ.25 లక్షల నిధులు దుర్వినియోగం జరిగినట్లు సమాచారం. చెరువులు లేనిచోట కాలువలు పూడికతీశారు. అదికూడా తూతూమంత్రంగానే. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో కోవూరు, జొన్నవాడ కాలువలను 30 అడుగుల లోతు పూడికతీయా ల్సి ఉండగా... పైపైనే మట్టి, గుర్రడెక్కలను తొలగించి అసంపూర్తిగా వదిలేశారు. ప్రస్తుతం భారీవర్షం కురిస్తే ఈ కాలువలకు గండిపడే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. వెంకటగిరి పరిధిలో పోలిశెట్టిగుంట, వెంకటగిరి చెరువు పనులు ఇదే తరహాలో జరుగుతున్నాయి. డక్కిలి మండలపరిధిలో టీడీపీ నాయకుడు తన ఐదెకరాల పొలం కోసం చాపలపల్లి చెరువును కలుజును ధ్వంసం చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ రైతులకు సంబంధించిన 30 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలను మభ్యపెట్టి అక్రమాలు వెంకటాచలం మండలంలో ఎక్కడ పడితే అక్కడ చెరువులను తవ్వి గ్రావెల్‌ను తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. కృష్ణపట్నం రైల్వేలైను బ్రిడ్జి దాని అనుసంధానం నిర్మాణాలకు స్థానికంగా ఉన్న చెరువుల నుంచి మట్టిని తరలించి తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. అనుమతులను ఒకచోట తీసుకొని మరోచోట గ్రావెల్ తరలిస్తున్నారు. నాయుడుపాళెం చెరువును ముద్దుగుంట చెరువు పేరుతో అనుమతులు తీసుకుని రైల్యేలైను పనులకు గ్రావెల్ తరలిస్తున్నట్లు సమాచారం. చవటపాళెం, కంటేపల్లి, కాకుటూరు కంటేపల్లి, ఇడిమేపల్లి ఆన, లింకు కాలువ, వీరన్న కనుపూరు చెరువు 1,2 తూముల పూడికపనులు, అనికేపల్లి చెరువు కలు జు మరమ్మతు పనులుకు నిధులు మంజూరయ్యాయి. ఈ పనుల్లో తమ్ముళ్లు పెద్దఎత్తున అవినీతికి తెరతీశారు. పొదలకూరు చెరువు నుంచి మట్టిని ఇటుకబట్టీలకు, రియల్వెంచర్లకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. సూళ్లూరుపేట పరిధిలో ఇనుపూరు, వెలగల పొన్నూరు, కేసీఎన్ గుంట, కోరిడి చెరువుల్లో మట్టిని తీసి అమ్ముకుంటున్నారు. అదేవిధంగా నెర్రికాలువ నుంచి కుదిరికి వెళ్లే సప్లైఛానల్ పనులు జరిగిన ట్లు రికార్డులు సృష్టించారు. అయితే అక్కడ అస్సలు పనులే జరగలేదని స్థానికులు చెబుతున్నారు. ఇకపోతే ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు పరిధిలోని చెరువుల్లో మట్టిని రియల్ వెంచర్లు, ఇటుకబట్టీలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. తడ పరిధిలో కొండూరు, కారూ రు, తడ చెరువుల నుంచి పరిశ్రమలు, భవన నిర్మాణాలకు సరఫరా చేసి జేబులు నింపుకుంటున్నారు. కావలి పరిధిలో ముసునూరు చెరువు నుంచి మట్టిని తీసి టీడీపీ నేత దాబా నిర్మాణానికి వినియోగించుకున్నారు. జలదంకి పరిధిలో జమ్మలపాళెం చెరువు మట్టిని రియల్ వెంచర్లు, కల్యాణమండపం నిర్మాణానికి తరలించుకుంటున్నారు. బొగోలు మండలంలో కోవూరుపల్లి చెరువు నుంచి 50 వేల క్యుబిక్మీటర్లు మాత్రమే మట్టిని తీయాల్సి ఉండగా... టీడీపీ నాయకుడు ఇప్పటికే 5 లక్షల క్యుబిక్ మీటర్లు తవ్వి అమ్ముకున్నట్లు సమాచారం. సంగం మండలంలో జంగాలకండ్రిగ, చెన్నవరప్పాడు, కొరిమెర్ల, తలుపూరుపాడు పరిధిలోని చెరువుల్లో పాతగుంతలను చూపించి అందిన కాడికి దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
దళితుల భూములు అపాచీకి ధారాదత్తం
దళితుల భూములను అపాచీకి ధారాదత్తం చేసేందుకు అధికారులు, పాలకులు యత్నిస్తున్నారు. పేదలకు భూములిచ్చినట్టే ఇచ్చి పారిశ్రామివేత్తల ప్రాపకం కోసం లాగేసుకుంటున్నారు. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఈ భూముల్లో 300 ఎకరాలు అపాచీకి కేటాయించినట్లు చెబుతుంటే.. అధికారులు పొంతన లేని ప్రకటనలు చేస్తుండటంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. కొడవలూరు: మండలంలోని బొడ్డువారిపాళెం రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి పక్కన ఉన్న సీజేఎఫ్ఎస్ భూమిని గతేడాదిలో 200 మంది దళితులకు పంపిణీ చేశారు. లబ్ధిదారుల్లో ఆ భూములకు ఆనుకునే ఉన్న చంద్రశేఖరపురం దళితవాడకు చెందిన వారు 70 మంది కాగా, దక్షిణ దళితవాడకు చెందిన వారు 130 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 60 సెంట్ల భూమి వంతున పంపిణీ చేసి పట్టాలు కూడా ఇచ్చారు. ఆ సమయంలో వెంటనే సాగు ఆరంభించమని అధికారులు సూచించారు. ముస్లింల దైవకార్యక్రమమైన ‘ఇస్తిమా’కు ఆ స్థలం వినియోగించుకునేందుకు లబ్ధిదారులు అంగీకరించారు. ఆ సమయంలో ఎడగారు సాగు చేయలేకపోయారు. ఇపుడు రబీకి సిద్ధమయ్యేందుకు భూములు దున్నుతుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకుని సాగు ఆపమని ఆదేశాలు జారీ చేశారు. ఈ భూమిలో 300 ఎకరాలను అపాచీ షూ కంపెనీకి ఇస్తున్నట్లు జన్మభూమి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. అయితే అక్కడుండేది 270 ఎకరాలు మాత్రమే. ఇందులో 132 ఎకరాలు దళితులకు పంపిణీ చేశారు. దీన్నిబట్టి దళితులకు ఇచ్చిన భూములు మొత్తం షూ కంపెనీకి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. స్థానిక అధికారులేమో పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. సాగు ఆపమన్నది వాస్తవమేనని అయితే వారి భూములకు ఢోకా ఉండదంటున్నారు. షూ కంపెనీకి 150 ఎకరాలే ఇస్తున్నామని కూడా చెబుతున్నారు. నేతలు, అధికారుల పొంతన లేని సమాధానాలతో దళితుల్లో ఆందోళన నెలకొంది. మా భూములు పోతే మా పరిస్థితేమిటని లబోదిబోమంటున్నారు. భూమి స్వరూపం ఇదీ.. చంద్రశేఖరపురం వద్ద 370 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములు ఉన్నాయి. వీటిలో 20 ఎకరాలను గిరిజన బాలికల గురుకుల కళాశాలకు కేటాయించగా ఆ స్థలంలో అది నడుస్తోంది. 20 ఎకరాలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు కేటాయించగా అక్కడ గిడ్డంగులు నిర్మించారు. ఇఫ్కో కర్మాగారానికి 5 ఎకరాలు ఇచ్చారు. జాతీయ రహదారి పనులకు గ్రావెల్ నిమిత్తం 35 ఎకరాల వరకు కేటాయించారు. మరో 20 ఎకరాల వరకు ప్రభుత్వ అవసరాలకు గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. గ్రావెల్‌కు ఉపయోగించిన 55 ఎకరాల్లో 30 నుంచి 40 అడుగుల లోతులో భారీ గుంతలున్నందున ఆ భూములు వినియోగించలేని పరిస్థితి నెలకొంది. ఇకపోతే కేవలం 270 ఎకరాలు మాత్రమే నికరంగా ఉంది. ఆ స్థలంలో షూ కంపెనీ వస్తుందని పురపాలకశాఖ మంత్రి నారాయణ కూడా ప్రకటించారు. చట్టం ఏంచెబుతోంది : లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూములు సీజేఎఫ్ఎస్ భూములైనందున లబ్ధిదారులు మూడేళ్ల పాటు సాగు చేయని పక్షంలో ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. కానీ దళితులకు గతేడాదిలోనే పంపిణీ చేసి ఉన్నందున ఆ విధంగానూ తీసుకోవడం దళితులను మోసం చేయడమే. సీజేఎఫ్ఎస్ భూముల్లో దళితులు పెట్టుబడి పెట్టి సాగు చేసి ఉంటే ప్రభుత్వ అవసరాలకు ఆ భూమి తీసుకుంటే వారి పెట్టుబడి తిరిగి ఇవ్వబడదని కూడా నిబంధనల్లో ఉంది. ఇదే జరిగితే దళితులు రోడ్డున పడే అవకాశం ఉంది. -
స్ట్రాటో ఆవరణకు చేరిన భారతీయుడు
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు క్రీడలు యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత మారిన్ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిక్ నిలిచాడు. ఫైనల్లో జపాన్‌కు చెందిన తార కియ్ నిషికోరిపై విజయం సాధించాడు. పాక్ స్పిన్నర్ అజ్మల్‌పై ఐసీసీ నిషేధం పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. అజ్మల్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపింది. ఆగస్టులో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అజ్మల్ బౌలింగ్ తీరుపై సందేహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌క ఐసీసీకి నివేదించారు. దీంతో అజ్మల్‌కు పరీక్షలు నిర్వహించడంతో అతని బౌలింగ్ అక్రమమని తేలింది. నిషాకు జాతీయ మహిళల చెస్ చాంప్ జాతీయ మహిళల చాలెంజర్స్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిషా మెహతా గెలుచుకుంది. పనాజీ(గోవా)లో సెప్టెంబర్ 15న ముగిసిన పోటీల్లో నిషా మెహతా స్వర్ణపతకం సాధించింది. విజయలక్ష్మికి రజతం, తెలంగాణకు చెందిన హిందూజ రెడ్డి కాంస్యం గెలుచుకున్నారు. ప్రణయ్‌కు ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ భారత షటిలర్ హెచ్.ఎస్.ప్రణయ్ ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్నాడు. పాలెమ్‌బాంగ్ (ఇండోనేషియా)లో సెప్టెంబర్ 14న జరిగిన ఫైనల్లో అబ్దుల్ కోలిక్ (ఇండోనేషియా)ను ఓడించాడు. అతనికిది తొలి గ్రాండ్ ప్రి గోల్డ్‌టైటిల్. జాతీయం వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న సుప్రీం అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 12న తీర్పునిచ్చింది. సమాన అవకాశాలు, రక్షణ, పూర్తి భాగస్వామ్యం కల్పిస్తూ వికలాంగుల చట్టం 1995లో ఆమోదం పొందినప్పటికీ అమలు కాలేదని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోధా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. భారత్ -వియత్నాం మధ్య ఏడు ఒప్పందాలు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వియత్నాం పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 15న ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. చమురు గ్యాస్ రంగాల్లో సహకారం, భారత్ నుంచి రక్షణ కొనుగోళ్ల కోసం 10 కోట్ల డాలర్ల రుణం, ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు, కస్టమ్స్, యువజన వ్యవహారాలు, నైపుణ్యాల అభివృద్ధి, పశు వైద్యం వీటిలో ప్రధాన అంశాలు. ఈ పర్యటనలో రాష్ట్రపతి వియత్నాం అధ్యక్షుడు ట్రూన్ టాన్ సంగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛా నౌకాయానానికి ఇరు దేశాలు పిలుపునిచ్చాయి. పీఎస్‌యూల వాటా విక్రయం ప్రభుత్వ రంగ సంస్థలు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓఎన్జీసీ), కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)లలో వాటాలను విక్రయించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సెప్టెంబర్ 10న ఆమోదం తెలిపింది. ఈ మూడు కంపెనీల్లో వాటాల విక్రయం వల్ల రూ. 43,800 కోట్లు సమకూరనున్నాయి. 7.8 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 7.8 శాతంగా నమోదైంది. ఇది జూలైలో 7.96 శాతంగా ఉన్నట్లు సెప్టెంబర్ 12న విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. కాగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఆగస్టులో 3.74 శాతంగా నమోదైంది. ఇది గత ఐదేళ్లలో అతి తక్కువ స్థాయికి చేరింది. ఉల్లి, కూరగాయలతోపాటు ఆహారోత్పత్తుల ధరలు భారీగా తగ్గడం వల్ల మొత్తం ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైంది. అంతర్జాతీయం బాల్య వివాహాల్లో భారత్‌ది రెండో స్థానం: ఐరాస భారతదేశం బాల్య వివాహాల్లో రెండో స్థానంలో ఉందని ఐక్య రాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2000-12 మధ్యలో ఐదేళ్ల లోపున్న బాలల వివరాలు నమోదు చేయని విషయంలో కూడా భారత్ మొదటి స్థానంలో ఉందని ‘బాలల జీవితాల అభివృద్ధి, భవిష్యత్తు మార్పు- 25 ఏళ్లుగా దక్షిణాసియాలో బాలల హక్కులు’ అనే అంశంపై వెల్లడైన యూనిసెఫ్ నివేదిక తెలిపింది. 2000-12 మధ్యలో 71 మిలియన్ల ఐదేళ్లలోపు బాలల వివరాలు భారత్ నమోదు చేయలేదని వెల్లడించింది. బాల్య వివాహాల్లో బంగ్లాదేశ్ తొలి స్థానంలో ఉండగా, భారత్, నేపాల్, అఫ్గానిస్థాన్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆసియాన్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆసియాన్‌తో సేవలు, పెట్టుబడులకు సంబంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సెప్టెంబర్ 8న సంతకం చేసింది. ఆసియాన్ కూటమిలోని బ్రూనై, కాంబోడియా, లావోస్, మలేసియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల పార్లమెంట్లు ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంది. ఈ ఒప్పందం వల్ల భారత్‌కు ఆర్థిక, విద్య, ఆరోగ్యం, ఐటీ, టెలికమ్యూనికేషన్స్, రవాణా రంగాల్లో ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. అవార్డులు ప్రొ. కమల్‌బవాకు మిడోరి పురస్కారం భారతీయ పర్యావరణ శాస్త్రవేత్త, బోస్టన్లోని మసాచుసెట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కమల్ బవా ప్రతిష్టాత్మక మిడోరి-2014 పురస్కారానికి ఎంపికయ్యారు. జపాన్‌కు చెందిన పర్యావరణ ఫౌండేషన్ జీవ వైవిధ్యంలో కృషి చేసిన వారికి ఈ అవార్డును అందిస్తుంది. హిమాలయాల్లో వాతావరణ మార్పులపై పలు పరిశోధనలు చేసినందుకు కమల్‌బవా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన బెంగళూరులోని అశోకా ట్రస్టు ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బహుమతికి ఎంపికైన వారిలో ఘనా నేషనల్ బయో డైవర్సిటీ కమిటీ చైర్మన్ ఆల్ఫ్రెడ్ ఓటెంగ్-యెబోహ, అర్జెంటీనా జాతీయ పరిశోధన మండలి ప్రధాన పరిశోధకుడు బిబియానా విలో కూడా ఉన్నారు. ఈ అవార్డును జపాన్‌లోని అయోన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్, కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ సెక్రటేరియట్ 2010 నుంచి అందజేసున్నాయి. అవార్డుకు ఎంపికైన వారికి లక్ష డాలర్ల బహుమతి ప్రదానం చేస్తారు. అక్టోబర్ 15న దక్షిణ కొరియాలోని పియాంగ్ చాంగ్‌లో జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)-12లో పురస్కారాన్ని అందజేస్తారు. బంగ్లాదేశ్, తూర్పు తైమూర్లకు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రజారోగ్య పురస్కారాలు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రజారోగ్య పురస్కారానికి బంగ్లాదేశ్ కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ జాతీయ సలహా కమిటీ చైర్పర్సన్ సైమా హుస్సేన్ ఎంపికయ్యారు. దక్షిణాసియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అటిజం (నాడీ సంబంధిత వ్యాధి)పై విస్తృత అవగాహన కల్పించినందుకు ఈమెకు ఈ అవార్డు దక్కింది. కాగా తైమూర్ దేశానికి చెందిన జాతీయ మలేరియా నివారణ కార్యక్రమం ప్రాంతీయ విభాగంలో అవార్డుకు ఎంపికయింది. దేశంలో మలేరియాను అరికట్టడానికి చేపట్టిన సమర్థమెన చర్యలకు ఈ గౌరవం లభించింది. సెప్టెంబర్ 10న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ అవార్డుల ప్రదానం చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు సాక్షర భారత్ పురస్కారం ప్రకాశం జిల్లా కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ సాక్షర భారత్ - 2014 పురస్కారాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో సెప్టెంబర్ 8న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. అక్షర విజయం కార్యక్రమం ద్వారా ప్రకాశం జిల్లాలో కేవలం 9 నెలల కాలంలో 4.75 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినందుకు జాతీయ సాక్షరతా మిషన్ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. నీలేకనికి వి.కృష్ణమూర్తి ఎక్స్‌లెన్స్ అవార్డు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్ మెంట్‌ను నెలకొల్పిన వి.కృష్ణమూర్తి ఎక్సలెన్స్ అవార్డు- 2014కు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ మాజీ చైర్మన్ నందన్ నీలేకని ఎంపికయ్యారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. రాష్ట్రీయం హైకోర్టులో ఐదుగురు శాశ్వత న్యాయమూర్తులు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో జస్టిస్ ఎ. రాజశేఖరరెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ సరసా వెంకట నారాయణ భట్టి, జస్టిస్ ఎ.వి.శేషసాయి, జస్టిస్ చల్లా. కోదండరామ్‌లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా సెప్టెంబర్ 5న వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9)ని తెలంగాణ భాషా దినోత్సవంగా ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సెప్టెంబర్ 9న ప్రకటించారు. కాళోజీ శత జయంతి వేడుకల్లో భాగంగా వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా ఇక్కడ నిర్మించనున్న కాళోజీ కళా కేంద్రానికి కూడా శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ఎలక్ట్రానిక్స్ విధానం ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబ ర్ 9న కొత్త ఎలక్ట్రానిక్స్ విధానం 2014-2020 ప్రకటించింది. ఈ విధానం ద్వారా రూ. 30వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించింది. ఆంధ్రాలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి సంస్థ (స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్)ను ఏర్పాటు చేసింది. దీనికి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐటీ రంగ నిపుణులు గంటా సుబ్బారావును, సంచాలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణలను నియమిస్తూ సెప్టెంబర్ 10న ఉత్తర్వులు జారీచేసింది. వార్తల్లో వ్యక్తులు ప్రపంచ బ్యాంకు ఈడీగా సుభాష్‌చంద్ర గార్గ్ భారత్ తరపున ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా సుభాష్‌చంద్ర గార్గ్ సెప్టెంబర్ 10న నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ హోదాలో కొనసాగుతారు. ఆయన రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అస్కి చైర్మన్‌గా నరేంద్ర అంబ్వానీ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (అస్కి) చైర్మన్‌గా ఆగ్రోటెక్ ఫుడ్స్ డెరైక్టర్ నరేంద్ర అంబ్వానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకటనలకు ప్రమాణాలు నిర్దేశించే విషయంలో అస్కి కృషి చేస్తుంది. విద్యావేత్త కీర్తి జోషి మృతి విద్యావేత్త, కేంద్ర ప్రభుత్వ మాజీ విద్యా సలహాదారు కీర్తిజోషి (83) పుదుచ్చేరిలో సెప్టెంబర్ 14న మరణించారు. 1976లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను భారత ప్రభుత్వ విద్యాసలహాదారుగా నియమించింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివ ర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచన కీర్తిజోషిదే. సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రాటో ఆవరణకు చేరిన ఇస్రో శాస్త్రవేత్త సురేశ్‌కుమార్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త టి.ఎన్.సురేశ్‌కుమార్ భూ వాతావరణంలో రెండో పొర స్ట్రాటో ఆవరణ వరకు ప్రయాణించారు. దీంతో స్ట్రాటో ఆవరణ చేరిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. ఆయన ఈ ఏడాది ఆగస్టు 15న రష్యాలోని సొకోల్ వైమానిక స్థావరం నుంచి మిగ్-29లో 17,100 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. ఈ నౌక 45 నిమిషాల్లో 1,850 కి.మీ వేగంతో స్ట్రాటో ఆవరణను చేరింది. రష్యాలోని కంట్రీ ఆఫ్ టూరిజం లిమిటెడ్ అనే స్పేస్ ట్రావెల్ సంస్థ ద్వారా కుమార్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ప్రపంచంలో ఈ యాత్ర చేపట్టిన వారిలో కుమార్ 259వ వ్యక్తి. ఎడ్జ్ ఆఫ్ స్పేస్ అనే ఈ యాత్రను ఆరేళ్ల కిందట ప్రారంభించారు. అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-1 క్షిపణిని రక్షణశాఖ సెప్టెంబర్ 10న ఒడిశాలోని బాలాసోర్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. అణుసామర్థ్యం గల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయాణిస్తుంది. 700 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. రోడ్డు, రైల్ మొబైల్ లాంఛర్ల నుంచి ప్రయోగించవచ్చు. 1000 కిలోల సంప్రదాయ, అణు ఆయుధాలను మోసుకుపోగలదు. సెకనుకు 2.5 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 15 మీటర్ల పొడవు గల ఈ క్షిపణి బరువు 12 టన్నులు. -
పోలంరెడ్డి బంధువు ఇంట్లో భారీగా మద్యం
విడవలూరు,న్యూస్‌లైన్: ఈ నెల 7న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ కోవూరు అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి బంధువు పోతిరెడ్డి సుబ్బారెడ్డి నివాసంలో భారీ మద్యాన్ని నిల్వ ఉంచారు. ఈ విషయం తెలిసి ఎక్సైజ్‌శాఖ అధికారులు శనివారం దాడి చేసి సుమారు 1902 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పోతిరెడ్డి సుబ్బారెడ్డి ఇంట్లో భారీగా మద్యం ఉన్నట్టు సమాచారం అందిందన్నారు. సిబ్బందితో కలిసి దాడి చేయగా సుబ్బారెడ్డి ఇంట్లో 30 బస్తాల్లో 1773 బాటిళ్ల(హనిబీ)ను, సమీపంలో కందుకూరి రవికుమార్ ఇంటి ఆవరణలోని బాత్రూంలో నాలుగు బస్తాల్లో సుమారు 129 బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. సుబ్బారెడ్డి, రవికుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్టు ఆయన వివరించారు. ఓటర్లకు మద్యంతో ఎర వేసేందుకే.. విడవలూరు మండలంలో వైఎస్సార్సీపీ గాలి బలంగా వీస్తుండటంతో టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఓట్లు రాబట్టుకునేందుకు దొడ్డిదారిని ఎంచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తన సోదరి మాతూరు జయలక్ష్మి ఆడపడచు భర్త (పోలంరెడ్డికి అన్న వరుస) నివాసంలో భారీగా మద్యాన్ని నిల్వ ఉంచారని ఆరోపణలున్నాయి. అంతేకాక సుబ్బారెడ్డి కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వెల్డింగ్ షాపులో విధులు నిర్వహిస్తున్నాడు. నియోజకవర్గ పరిధిలో ఇంత భారీ మొత్తంలో మద్యం నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ దాడిలో ఎక్సైజ్ శాఖ అధికారులు రవికుమార్, సుధాకర్‌రెడ్డి, ఎన్ వసంతరావు, సూర్యానారాయణ, కిషోర్,కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
చీటింగ్ రాజాకు టీడీపీ టికెట్!
‘ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని ఒక సినిమా కవి తన పాటలో రాసిన మాట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు నీటుగా సరిపోతోంది. గురివింద తన కింద నలుపెరుగని చందంగా నీతులు వల్లించే ఆ ప్రబుద్ధుడు తన పార్టీ కోవూరు టికెట్‌ను క్రిమినల్ కేసుల్లో నిందితుడు, రియల్ మోసాలకు తెగబడ్డ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి కట్టబెట్టారు. పక్క పార్టీల వారంతా దొంగలు తన పార్టీకి వచ్చిన వారంతా మిస్టర్ క్లీన్స్ అనేలా జనాన్ని నమ్మించేందుకు ఆపసోపాలు పడే నారా వారికి పోలంరెడ్డి నైజం, ఆయన మోసాల చరిత తెలియదా? సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: ప్రభుత్వ స్థలం కనిపిస్తే గద్దలా వాలిపోయి కబ్జా చేయడం. నిరుపేదల కడుపులు కొట్టి ఆ స్థలాన్ని తన సొంతం చేసుకోవడం. రిసార్ట్స్ పేరుతో ప్రజల నుంచి డ బ్బులు వసూలు చేసి, ప్లాట్ ఇవ్వక పోవడం. బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వని వ్యవహారం. ఏతా వాతా వినియోగదారులను మోసం చేసి పంగనామాలు పెట్టడం. ఇదంతా శ్రీనిధి హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీనిధి జాయ్ ఎన్ జాయ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఘనత. ఈ రకమైన వ్యవహారాలతోనే ఆయన తమను ఛీట్ చేశారని బాధితులు పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి. ఇవే కాకుండా కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలున్న పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి చంద్రబాబు టీడీపీ టికెట్ ఇచ్చారు. కోవూరు ఎన్నికల అధికారికి పోలంరెడ్డి సమర్పించిన అఫిడవిట్లో రెండు చీటింగ్ కేసులు ఉన్నాయి. 2001 నుంచి ఆయనగారి భూ కబ్జాలు, చీటింగ్ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొడవలూరు నుంచి హైదరాబాద్ దాకా... కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్తురాజుపాళేనికి చెందిన పోలంరెడ్డ్డి శ్రీనివాసులురెడ్డి టెన్త్ పాసైన తరువాత వెంకటేశ్వరపురంలోని ఐటీఐలో వెల్టర్గా శిక్షణ పొందారు. హైదరాబాద్ నాచారంలోని రామకృష్ణా సినీ స్టూడియో పక్కన వెల్డింగ్ షాపు నిర్వహించేవారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చే టీడీపీ నాయకులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత సిమెంట్, స్టీల్, వ్యాపారంలో ప్రవేశించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగారు. అప్పట్లో ఘట్కేసర్ మండలం భువనగిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చేది. ఆ జిల్లాలో అప్పట్లో చక్రం తిప్పిన టీడీపీ నాయకుడొకరి అండదండలతో దొరికిన ప్రభుత్వ స్థలాలన్నింటినీ కబ్జాచేసి వెంచర్లు వేశారనే ఆరోపణలున్నాయి. ఇదీ కథ.. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ఆషాపూర్ గ్రామంలోని నేలకుంట చెరువును శ్రీనిధి హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆక్రమించాడని పి.రాజారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నీటిపారుదల శాఖకు చెందిన ఈ స్థలాన్ని ఆక్రమించి నష్టపరచిన ందుకు ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో 2001 మార్చి 5వ తేదీన సెక్షన్ 447, 427 కింద పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై కేసు నమోదు చేశారు. నిరుపేదలకు ఉపయోగపడాల్సిన ఈ స్థలాన్ని ఆక్రమించి ప్రభుత్వాన్ని మోసం చేశాడని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తన నుంచి శ్రీనిధి జాయ్ ఎన్జాయ్ రిసార్ట్స్ చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని సీహెచ్ కాంతారావు అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు విజయవాడ సిటీ పరిధిలోని సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పోలంరెడ్డిపై 420 చీటి ంగ్ కేసు నమోదు చేశారు. తాజాగా రెండు కేసులు రంగారె డ్డి జిల్లా ఘట్ కేసర్‌కు చెందిన డి.శ్రీరామ్‌రెడ్డి అనే వ్యక్తి తనకున్న 15 ఎకరాల స్థలంలో 10 ఎకరాల స్థలాన్ని శ్రీనిధి హోమ్స్ ఎండీ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి అమ్మారు. అయితే పోలంరెడ్డి మిగతా 5 ఎకరాల స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని శ్రీరామ్‌రెడ్డి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై 427,447 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలంరెడ్డితోపాటు గోపాల్‌రెడ్డి అనే మరో వ్యక్తి ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. ఈ కేసులో పోలంరెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే పోలంరెడ్డి తన రిసార్ట్స్‌లో ప్లాట్లు ఇస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేశారని హైదరాబాద్‌కు చెందిన బయ్యా బాబాయ్, రమాదేవి కుమార్, అనుపమాదేవి కుమార్ అనే వ్యక్తులు ఉస్మానియా వర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, గోపాల్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై పోలీసులు 406,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనీ సర్క్యులేషన్ పేరుతో మోసం తన సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి అత్యధిక లాభాలిస్తామని నమ్మబలికి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి 1999-2000లో జాయ్-ఎన్-జాయ్ సంస్థను స్థాపించి మనీసర్క్యులేషన్ స్కీంను ప్రారంభించారు. రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల్లోను స్కీంను విస్తరింపజేశారు. మధ్య తరగతి ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బును మనీసర్క్యులేషన్లో పెట్టారు. ప్రజల నుంచి అధిక మొత్తాల్లో డబ్బులు వసూలు చేసి చివరికి మొండిచేయి చూపారు. తమను నిలువెల్లా మోసం చేసిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్స్టేషన్లలో బాధితుల పక్షాన కేసులు నమోదయ్యాయి. దీంతో పోలంరెడ్డి బాధితుల్లో కొందరికి డబ్బులు చెల్లించి, కొందరికి చెల్లించకనే మనీసర్క్యులేషన్ సంస్థ బోర్డు తిప్పేసి నెల్లూరుకు చేరారు. -
బాబ్బాబు..ఒప్పుకో!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం టికెట్ విషయమై పార్టీ అధినేత చంద్రబాబు నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే ఆ టికెట్‌ను ఆశిస్తున్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని ఎలాగైనా ఒప్పించుకునే బాధ్యత పోలంరెడ్డిపైనే బాబు ఉంచినట్లు తెలిసింది. దీంతో రెండు రోజు లుగా పోలంరెడ్డి పెళ్లకూరుతో సయోధ్యకు యత్నాలు ప్రారంభించారు. ముం దుగా శుక్రవారం పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మరి కొందరు ముఖ్య నేతలతో కలిసి నగరంలోని మాగుంట లేఅవుట్లో గల పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఇంటికి వెళ్లడమే కాకుండా ఆయనతో సయోధ్య కోసం సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. అయితే తాను తన అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడనిదే ఏ విషయం చెప్పలేనని పెళ్లకూరు తేల్చి చెప్పడంతో తిరిగి శనివారం రెండోదఫా చర్చలకు సిద్ధమయ్యారు. అయితే ఈ సారి వేదిక ఇనమడుగుకు మారింది. పెళ్లకూరును ఎలాగైనా ఒప్పించి అనుకూలంగా మలుచుకునేందుకు పోలంరెడ్డి వి శ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అం దుకు పెళ్లకూరు అనుచరులు ససేమిరా అనడంతో పాటు పెద్ద గొడ వ కూడా జరిగింది. ఎట్టి పరి స్థితుల్లోనూ తాము పోలంరెడ్డికి మద్దతిచ్చేది లేదని కార్యకర్తలు అడ్డు తగడలడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో సమావేశం నుంచి పెళ్లకూరు అర్ధాం తరంగా నిష్ర్కమించినట్టు తెలిసింది. -
టీడీపీలో ఇంటిపోరు
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరుకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడి నేతలు నిత్యం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుంటారు. ఇక్కడి రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటాయి. అందుకే జిల్లా కేంద్రమైన నెల్లూరు సిటీ నియోజకవ ర్గంపై అందరి దృష్టి పడింది. ఇది టీడీపీలో ఇంటిపోరుకు దారితీసింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పలువురు నేతలు భావిస్తుండటంతో ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. 2009 ఎన్నికల్లో బాలకృష్ణ సహకారంతో టికెట్ తెచ్చుకుని పోటీచేసిన తాళ్లపాక రమేష్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. అనంతరం ఆ పార్టీలో నిస్తేజం ఆవహించింది. అడపాదడపా మొక్కుబడిగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించినా, కాంగ్రెస్ వ్యతిరేకంగా పెద్దగా ఉద్యమించిన దాఖలాలు లేవు. కొంతకాలంగా టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురె డ్డి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ సేవాసమితి పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతున్న ఆయన టికెట్ విషయంలో తనకు బాలకృష్ణ ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. రమేష్‌రెడ్డి సైతం తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన రాకను కోటంరెడ్డి, రమేష్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీనే నమ్ముకుని ఉన్న తమను కాదని మరోపార్టీ నుంచి వచ్చిన నేతకు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయడం తగదని వాదిస్తున్నారు. ఇది పార్టీ కేడర్‌కు ప్రతికూల సంకేతాలు వెళ్లే పరిస్థితికి దారితీస్తుందని ఇప్పటికే చంద్రబాబు దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే కోటంరెడ్డి, రమేష్‌రెడ్డిని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అంచెల వాణిని రంగంలో దింపాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కౌన్సిలర్, కార్పొరేటర్‌గా పనిచేసిన అంచెల వాణి ఇప్పటికే చంద్రబాబును కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మేయర్ భానుశ్రీ పోటీ చేసే అవకాశం ఉన్నందున, బీసీ మహిళనే బరిలో నిలపాలని ఆమె కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోమిరెడ్డి సైతం ఇదే సమీకరణాలను అధినేతకు వివరించినట్లు తెలిసింది. వాణికి నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణతో బంధుత్వం ఉంది. ఆయన అండ కూడా తోడవడంతో వాణి అభ్యర్థిత్వం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి రమేష్‌రెడ్డి, కోటంరెడ్డిని సోమిరెడ్డి విభే దిస్తూ వస్తున్నారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలోనే ఆయన మధ్యేమార్గంగా అంచెల వాణిని ప్రతిపాదిస్తూ వ్యూహం పన్నినట్లు సమాచారం. బీద రవిచంద్ర సైతం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టు తెలుస్తోంది. అంచెల వాణి సామాజిక వర్గం ఓటర్లు నెల్లూరులో అధికంగా ఉండడం, టీడీపీ ముఖ్య నేతలతో పాటు నారాయణ మద్దతు నేపథ్యంలో ఆమెకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. బాలకృష్ణ భరోసాతో టికెట్ తనదేనన్న ధీమా కోటంరెడ్డిలో కనిపిస్తోంది. ముఖ్య నేతల మద్దతు లేకపోవడం ఆయనకు మైనస్. అంచెల వాణి అభ్యర్థి అయితే రమేష్‌రెడ్డి, కోటంరెడ్డికి కార్పొరేషన్ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తారనే ప్రచారం ఉంది. మొత్తంగా నగరంలో టికెట్ గొడవ టీడీపీలో కుమ్ములాటలను పతాకస్థాయికి తీసుకెళ్లింది. -
జల వివాదాలు జటిలం
రాష్ట్ర విభజన వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో అనేక వివాదాలు ఏర్పడతాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఏకైక పరిష్కారమని శనివారం స్థానిక జెడ్పీ మీటింగ్ హాల్లో ‘‘రాష్ట్ర విభజన- జల వివాదాలు’’ అనే అంశంపై ఏపీయూడబ్ల్యూజే ఏర్పాటు చేసిన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే నాయకుడు రామసుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. ఆ సంఘం రాష్ట్ర నాయకుడు సురేష్, ఐజేయూ నాయకుడు శ్రీనివాసులురెడ్డి , మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. - న్యూస్‌లైన్, కడప కలెక్టరేట్ ప్రాజెక్టులు నిరర్థకం రాయలసీమలోని తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, తెలంగాణలో ని నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమ ప్రాజెక్టులకు నికర జలాలు లభించవు. ఇప్పటికే సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చుచేసి 70 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్టులు విభజన వల్ల నిరర్థకంగా మా రుతాయి. మిగులు జలాల పంపిణీపై పరిష్కార ఒప్పందాలు చేసుకోవడానికి అ వకాశం ఉండదు. శ్రీశైలం, జురాల, నాగార్జున సాగర్లు అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులుగా మారుతాయి. విభజన తర్వాత ఏర్పాటయ్యే బోర్డు ట్రిబ్యూనల్ కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు నీరుసక్రమంగా అందించేందుకే పరిమితమవుతుం ది. మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల అంశం బోర్డు పరిధిలో ఉండదు. తెలంగాణ ఏర్పడితే పోలవరం, దమ్ముగూడెం, సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు నిర్మాణం కావు. రాయల తెలంగాణ వల్ల కూడా చుక్కనీరు అందదు. నీటి సమస్య పరిష్కారం కావాలంటే కృష్ణా నీటిని ఉపయోగించుకొనే 18 జిల్లాలు ఒక రాష్ట్రంగా ఏర్పడాలి. ఇక మిగిలిన ఐదు జిల్లాలు ఏం పాపం చేశా యి. లేదంటే మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలను సీమాం ధ్రలో కలపాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే మేలు. శాసనసభ ప్రొరోగ్ కా లేదు గనుక ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సభను సమావేశపరిచి విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. - ఎంవి మైసూరారెడ్డి, వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు నీటి కేటాయింపులు వివాదాస్పదమవుతాయి ఎస్ఆర్బీసీ, బీమా, శ్రీశైలం నుంచి కేసీ కెనాల్‌కు నీటి విడుదల వంటి అంశాల్లో రాష్ర్ట పరిధిలో జరిగిన కేటాయింపులు విభజన తర్వాత వివాదాస్పదంగా మారుతాయి. రాయలసీమ కృష్ణా పరివాహక ప్రాంతంలో లేదని చెప్పడం మూర్ఖత్వం. కృష్ణా జలాల్లో రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న శ్రీబాగ్ ఒప్పందం కాలగర్భంలో కలిసిపోయింది. కృష్ణా- పెన్నా ప్రాజెక్టులు అటకెక్కించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా నిర్మిస్తామని చెప్పిన సిద్దేశ్వరం గాలిలో కలిసిపోయింది. బళ్లారిని రాయలసీమ వాసులు కోల్పోయారు. బ్రజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ అన్యాయంగా తీర్పు ఇచ్చింది. నికర జలాలను మాత్రమే పంపిణీ చేసి మిగులు జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలి. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానమే సాగునీటి సమస్యకు పరిష్కారం. -టి.లక్ష్మినారాయణ, డెరైక్టర్, నీలం రాజశేఖరరెడ్డి రీసెర్చ్ సెంటర్. గోదావరిపై హక్కు కోల్పోతాం తెలంగాణ వాసులు ఇప్పటికే పోలవరం ప్రా జెక్టుకు అడ్డు చెబుతున్నారు. ఇక రాష్ట్రమే విడిపోతే ఆ ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయి సీమకు అందాల్సిన నికర జలాలు దక్కకుండా పో తాయి. భద్రాచలాన్ని వదులుకుంటే గోదావరిపై హక్కే కోల్పోతాం. విభజన జరిగితే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజి నిండిన తర్వాతగానీ మనకు నీరు అందదు. తెలంగాణలోని బీమా ప్రాజెక్టుకు కూడా 20 టీఎంసీల నికర జలాలు లభించవు. హైదరాబాద్ తాగునీటి అవసరాలను కోసం సాగర్ నుంచి ఇస్తున్న 12 టీఎంసీల నీటిని ఎవరు భరించాలో తేల్చాల్సి ఉంటుంది. కేసీ కెనాల్‌కు శ్రీశైలం నుంచి నీటి విడుదలకు అవకాశం లేకుండా పోతుంది. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఇలాంటి జల వివాదాలు ఏర్పడవు. - ప్రభాకర్‌రెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు నికర జలాలు కేటాయించాకే విభజనపై చర్చ రాష్ట్రంలోని ఎనిమిది కరువు జిల్లాల కోసం మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టులకు చుక్కనీరు లభించదు. ట్రిబ్యునల్స్, రివర్ వ్యాలీ అథారిటీలు ఈసమస్యను పరిష్కరించలేవు. దీనికి పరి ష్కారమేదైనా ఉంటేసమైక్య రాష్ట్రం లోనే జరగాలి. విభజిస్తామంటే సీమ పరిస్థితి ఏమిటి?. రాష్ట్ర విభజనకు ముందే నికర జలాల కేటాయింపు సమస్యను పరిష్కరించాలి. - సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక కర్షక సమితి సీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగాలి రాయలసీమలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సుమారు 150 టీఎంసీల నీరు అవసరముంటుంది. నికర జలాలు అందకపోతే ఇవి ఎందుకు కొరగాకుండా పోతాయి. కృష్ణా మిగులు జలాలను బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇతర రాష్ట్రాలకు కూడా పంపిణీ చేయడం వల్ల మనం నష్టపోయాం. సీమ వాసులే ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ ఇక్కడ కరువు, దారిద్య్రం పోలేదు. పో లవరం ప్రాజెక్టును తెలంగాణా నేతలు వ్యతిరేకించడంలో అర్థంలేదు. జాతీయ స్థాయి విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు అన్ని హైదరాబాద్‌లోనే ఉన్నాయి. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ నుంచే అధికంగా వస్తోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌ను ఖాళీచేసి వెళ్ళాలనడం దారుణం. -ఎం.లింగారెడ్డి, ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు. సమైక్యవాదులను గెలిపించండి రానున్న ఎన్నికల్లో సమైక్యవాదులను ప్రజలు గెలిపిం చాలి. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే జ ల వివాదాలు ఏర్పడవు. ఇప్పటికే తుంగభద్ర నుంచి సీబీఆర్‌కు, మైలవరానికి నీరు రావడం లేదు. రాష్ట్ర విభజనే జరిగితే మిగులు జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు నిరుపయోగమవుతాయి. అన్ని పార్టీలు సమైక్యాంధ్ర కోసం పాటుపడాలి. గంగా-కావేరి అనుసంధాన కార్యక్రమం జరగాలి. -ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే, జమ్మలమడుగు 3 ఉద్యోగులకు బ్యాంకు రుణాలకు సన్నాహాలు Preparations for bank loans to employees కడప సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని, వారికి బ్యాంకుల ద్వారా రుణాలందిస్తామని డీఆర్వో ఈశ్వరయ్య తెలిపారు. నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సమైక్యాంధ్ర ఉద్యమంపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ట్రెజరీ ఉద్యోగులు, అధికారులు సమ్మెలో ఉన్నారన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని ప్రభుత్వ బిల్లులు పాస్ కావడం లేదని తెలిపారు. చిరు ఉద్యోగులు సమ్మెతో కష్టాలు, నష్టాలకు గురికావలసి వస్తోందన్నారు. ఇలాంటి వారందరి కోసం బ్యాంకుల ద్వారా రుణాలందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ద్వారా పలు బ్యాంకు అధికారులతో రుణాల విషయం చర్చించామన్నారు. సమావేశంలో ట్రెజరీ జిల్లా అధికారులు రంగప్ప, నాగరాజు, బాలసుబ్రమణ్యం, వెంకటసుబ్బయ్య, ఎన్జీవో సంఘం నాయకులు కెవి శివారెడ్డి, శ్రీనివాసులు, జి. రవికుమార్, రామ్మూర్తినాయుడు, తదితరులు పాల్గొన్నారు.