‘ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని ఒక సినిమా కవి తన పాటలో రాసిన మాట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు నీటుగా సరిపోతోంది. గురివింద తన కింద నలుపెరుగని చందంగా నీతులు వల్లించే ఆ ప్రబుద్ధుడు తన పార్టీ కోవూరు టికెట్‌ను క్రిమినల్ కేసుల్లో నిందితుడు, రియల్ మోసాలకు తెగబడ్డ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి కట్టబెట్టారు. పక్క పార్టీల వారంతా దొంగలు తన పార్టీకి వచ్చిన వారంతా మిస్టర్ క్లీన్స్ అనేలా జనాన్ని నమ్మించేందుకు ఆపసోపాలు పడే నారా వారికి పోలంరెడ్డి నైజం, ఆయన మోసాల చరిత తెలియదా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: ప్రభుత్వ స్థలం కనిపిస్తే గద్దలా వాలిపోయి కబ్జా చేయడం. నిరుపేదల కడుపులు కొట్టి ఆ స్థలాన్ని తన సొంతం చేసుకోవడం. రిసార్ట్స్ పేరుతో ప్రజల నుంచి డ బ్బులు వసూలు చేసి, ప్లాట్ ఇవ్వక పోవడం. బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వని వ్యవహారం. ఏతా వాతా వినియోగదారులను మోసం చేసి పంగనామాలు పెట్టడం.
ఇదంతా శ్రీనిధి హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీనిధి జాయ్ ఎన్ జాయ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఘనత. ఈ రకమైన వ్యవహారాలతోనే ఆయన తమను ఛీట్ చేశారని బాధితులు పోలీస్‌స్టేషన్లో చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి. ఇవే కాకుండా కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలున్న పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి చంద్రబాబు టీడీపీ టికెట్ ఇచ్చారు. కోవూరు ఎన్నికల అధికారికి పోలంరెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లో రెండు చీటింగ్ కేసులు ఉన్నాయి. 2001 నుంచి ఆయనగారి భూ కబ్జాలు, చీటింగ్ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి.
కొడవలూరు నుంచి
హైదరాబాద్ దాకా...
కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్తురాజుపాళేనికి చెందిన పోలంరెడ్డ్డి శ్రీనివాసులురెడ్డి టెన్త్ పాసైన తరువాత వెంకటేశ్వరపురంలోని ఐటీఐలో వెల్టర్‌గా శిక్షణ పొందారు. హైదరాబాద్ నాచారంలోని రామకృష్ణా సినీ స్టూడియో పక్కన వెల్డింగ్ షాపు నిర్వహించేవారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చే టీడీపీ నాయకులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత సిమెంట్, స్టీల్, వ్యాపారంలో ప్రవేశించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగారు. అప్పట్లో ఘట్‌కేసర్ మండలం భువనగిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చేది. ఆ జిల్లాలో అప్పట్లో చక్రం తిప్పిన టీడీపీ నాయకుడొకరి అండదండలతో దొరికిన ప్రభుత్వ స్థలాలన్నింటినీ కబ్జాచేసి వెంచర్లు వేశారనే ఆరోపణలున్నాయి.
ఇదీ కథ..
రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఆషాపూర్ గ్రామంలోని నేలకుంట చెరువును శ్రీనిధి హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆక్రమించాడని పి.రాజారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నీటిపారుదల శాఖకు చెందిన ఈ స్థలాన్ని ఆక్రమించి నష్టపరచిన ందుకు ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్లో 2001 మార్చి 5వ తేదీన సెక్షన్ 447, 427 కింద పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై కేసు నమోదు చేశారు. నిరుపేదలకు ఉపయోగపడాల్సిన ఈ స్థలాన్ని ఆక్రమించి ప్రభుత్వాన్ని మోసం చేశాడని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తన నుంచి శ్రీనిధి జాయ్ ఎన్‌జాయ్ రిసార్ట్స్ చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని సీహెచ్ కాంతారావు అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు విజయవాడ సిటీ పరిధిలోని సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పోలంరెడ్డిపై 420 చీటి ంగ్ కేసు నమోదు చేశారు.
తాజాగా రెండు కేసులు
రంగారె డ్డి జిల్లా ఘట్ కేసర్‌కు చెందిన డి.శ్రీరామ్‌రెడ్డి అనే వ్యక్తి తనకున్న 15 ఎకరాల స్థలంలో 10 ఎకరాల స్థలాన్ని శ్రీనిధి హోమ్స్ ఎండీ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి అమ్మారు. అయితే పోలంరెడ్డి మిగతా 5 ఎకరాల స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని శ్రీరామ్‌రెడ్డి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై 427,447 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలంరెడ్డితోపాటు గోపాల్‌రెడ్డి అనే మరో వ్యక్తి ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. ఈ కేసులో పోలంరెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే పోలంరెడ్డి తన రిసార్ట్స్‌లో ప్లాట్లు ఇస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేశారని హైదరాబాద్‌కు చెందిన బయ్యా బాబాయ్, రమాదేవి కుమార్, అనుపమాదేవి కుమార్ అనే వ్యక్తులు ఉస్మానియా వర్సిటీ పోలీస్‌స్టేషన్లో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, గోపాల్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై పోలీసులు 406,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మనీ సర్క్యులేషన్ పేరుతో
మోసం
తన సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి అత్యధిక లాభాలిస్తామని నమ్మబలికి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి 1999-2000లో జాయ్-ఎన్-జాయ్ సంస్థను స్థాపించి మనీసర్క్యులేషన్ స్కీంను ప్రారంభించారు. రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల్లోను స్కీంను విస్తరింపజేశారు. మధ్య తరగతి ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బును మనీసర్క్యులేషన్‌లో పెట్టారు. ప్రజల నుంచి అధిక మొత్తాల్లో డబ్బులు వసూలు చేసి చివరికి మొండిచేయి చూపారు. తమను నిలువెల్లా మోసం చేసిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లలో బాధితుల పక్షాన కేసులు నమోదయ్యాయి. దీంతో పోలంరెడ్డి బాధితుల్లో కొందరికి డబ్బులు చెల్లించి, కొందరికి చెల్లించకనే మనీసర్క్యులేషన్ సంస్థ బోర్డు తిప్పేసి నెల్లూరుకు చేరారు.
చీటింగ్ రాజాకు టీడీపీ టికెట్!
Published Wed, Apr 30 2014 2:54 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement