అనంతపురం: అనంతపురం సర్వజనాస్పత్రి ఉన్నతాధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోగులకు చికిత్స చేస్తూ వైరస్ బారిన పడి క్వారంటైన్‌లో ఉన్న స్టాఫ్‌నర్సులు విధులకు గైర్హాజరైనట్లు రిజిష్టర్‌లో నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 14 రోజుల వరకు ఇళ్లలోనే ఉండాలని స్టాఫ్ నర్సులకు పోలీసులు నోటీసులిస్తే, ఆస్పత్రి అధికారులు మాత్రం విధులకు రాని వారికి గైర్హాజరు వేయడం ఎంతవరకు సమంజసమని స్టాఫ్‌నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వారంటైన్ సమయం ముగియకుండానే, మరోసారి పరీక్షలు చేయించకుండానే విధులకు రావాలని ఆస్పత్రి ఉన్నతాధికారి సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్‌ను వివరణ కోరగా.. వీడియో కాన్ఫరెన్స్ పేరుతో ఆయన అందుబాటులోకి రాలేదు. (బయటికొచ్చిన్రో.. వీపు లాఠీల మోతే!)
Comments
Please login to add a commentAdd a comment