
యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం
విశాఖ: ఓ స్టార్ హోటల్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. బాధితురాలు ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు... ఇద్దరు యువకులపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా గతంలో స్టార్ హోటల్‌లో పని చేసిన శ్రీధర్ అనే యువకుడు, తన స్నేహితుడితో కలిసి యువతికి మద్యం తాగించి వుడా పార్క్ సమీపంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి, యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.