విభజనకు బొత్సే కారణం
Published Mon, Jan 6 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : యూపీఏ చైర్‌పర్సన్ సోనియూ గాంధీతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందువల్లే ఆయన రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు విమర్శించారు. ఆదివా రం సమైక్యాంధ్రకు మద్దతు గా పట్టణంలోని దాసన్నపేట రింగురోడ్డులో టీడీపీ నాయకులు ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మంత్రి బొత్స మొదటి నుంచీ విభజనకు అనుకూలంగానే ఉన్నా రన్నారు. విభజనపై సీమాంధ్రలో నిరసనలు లేకుం డా చూసేందుకు సోనియూ, బొత్సకు ఐదు జిల్లాల బాధ్యతలను అప్పగించినట్టు చెప్పారు. జిల్లాకు ఇటీవల మంజూరైన గ్యాస్ కనెక్షన్ల పంపిణీలో రాజకీయ జోక్యం మితిమీరిందన్నారు.
జిల్లా కు మంజూరైన గ్యాస్ కనెక్షన్లలో ఎక్కువగా బొత్స కుటుంబీకులు ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గాలకు కేటాయించడం దారుణమన్నారు. జిల్లా తె లుగుయువత అధ్యక్షుడు కర్రోతు వెంకటనరసింగరావు మా ట్లాడుతూ రాహుల్‌ను ప్రధానిని చేయడానికే కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల మధ్య విభజన చిచ్చుపెట్టిందన్నారు. సమైక్యాం ధ్ర ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు పట్టణంలో పోలీసు చట్టాలను అమలు చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌ఎన్‌ఎం రాజు, పార్టీ నాయకులు బలివాడ అప్పారావు, మైలపల్లి పైడిరాజు, మద్దాల ముత్యాలరావు, జి. ప్రకాష్‌రావు, బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి తోలాపి మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement