జాప్యం చేయకుండా పెంచాలని ఉద్యోగ సంఘాల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 10 శాతం మేరకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్థానిక సూత్రీకరణ ప్రకారం కరువు భత్యం 8.56 శాతం మేరకు పెరగనుంది. ఈ పెంపును గత జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు రూపొందించిన అనంతరం దానికి రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపితే ఈ పెంపు అమల్లోకి వస్తుంది. అయితే గత కొన్ని దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగిన విషయాన్ని గుర్తించి.. కరువు భత్యం పెంపు నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8.56 శాతం పెంచితే.. వారి డీఏ మొత్తం 63.34 శాతానికి చేరుకున్నట్టవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగే డీఏ 8.56 శాతం!
Published Sat, Sep 21 2013 12:22 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement