కడప రూరల్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలకు ఆధార్‌ను తప్పని సరి చేసింది. అయితే అందుకు తగినట్లుగా చర్యలు చేపట్టలేదు. విద్యార్థులు ఉపకార వేతనాల ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆధార్ కార్డు జత పరచాలి. విద్యార్థులు నమోదు చేసుకుని నెలలు గడిచినా ఇంత వరకు ఆధార్ కార్డులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డు లేకపోవడంతో ఆ ప్రభావం తాజా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులపై పడింది. దీంతో ఆయా జిల్లా సంక్షేమ శాఖలకు చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు.
తాజా విద్యార్థులపై ప్రభావం
ప్రభుత్వం 2013-14 విద్యా సంవత్సరం నుంచి ఉపకార వేతనాలు పొందడానికి ఆధార్‌ను తప్పని సరి చేశారు. అంటే తాజా విద్యార్థులకు ఆధార్ కార్డులుంటేనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు కొన్ని నెలల క్రితం నమోదు చేసుకున్నప్పటికీ ఇంత వరకు వారికి కార్డులు అందలేదు. కాగా ఉపకార వేతనాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలైలో ప్రారంభమైంది. మధ్యలో సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా దాదాపు రెండు నెలలు కార్యాలయాలు మూతపడ్డాయి. ఉద్యోగుల సమ్మె ముగిసి రెండు నెలలు దాటినా ఇంత వరకు ఆధార్ కార్డులు విద్యార్థులకు అందలేదు.
తక్కువ దరఖాస్తులు
ఆధార్ కార్డులు లభించనందు వల్ల ఉపకార వేతనాల కోసం ఆన్‌లైన్ లో తక్కువ దరఖాస్తులు వ చ్చాయి. ఎస్సీ విద్యార్థుల నుంచి 8 వేలకు గాను 4300, బీసీ విద్యార్థుల నుంచి 16 వేలకు గాను 9000, ఈబీీసీ విద్యార్థుల నుంచి 7,500లకు గాను 6,607, ఎస్టీ విద్యార్థుల నుంచి 1000కి గాను 550 మంది దరఖాస్తు చేసుకోగలిగారు. మిగితా విద్యార్థులకు ఆధార్ కార్డులు అందక పోవడంతో వారు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. రెన్యువల్ విద్యార్థులకు ఆధార్ కార్డు సమస్య లేనందున ఆయా కేటగిరిలకు సంబంధించిన విద్యార్థులు దాదాపు 85 శాతం మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఆధార్ కార్డులు సకాలంలో అందకపోవడంతో విద్యార్థులే కాక మిగిలిన వర్గాలు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇంతవరకు అందని ఆధార్
Published Sat, Dec 14 2013 3:08 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM
Advertisement