శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. గురువారం పలుచోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆటోల ర్యాలీకి అనూహ్య స్పందన వచ్చింది. కలెక్టరేట్ వద్ద రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు రిలే దీక్షలు కొనసాగించారు. రాజాంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు.
పాలకొండ ఆంజనేయ సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్ష శిబిరంలోఎం.సింగుపురం సర్పంచ్ రణస్థలం రాంబాబు నేతృత్వంలో 30 మంది కూర్చున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు పాలవలస విక్రాంత్, విశ్వాసరాయి కళావతి నేతృత్వంలోని పార్టీ నాయకులు వైఎస్సార్ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి సమైక్య నినాదాలు చేస్తూ ఆటోలతో భారీ చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి వేదిక వద్ద డివిజన్‌లోని గ్రామ సేవకులు, రెవెన్యూ సిబ్బంది నిరాహారదీక్ష చేపట్టారు.
పలాస-పలాస పట్టణంలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆటోల ర్యాలీలో వజ్జ బాబూరావు తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గ బస్టాండ్ వద్ద రోడ్డుపై డాక్టర్ కణితి విశ్వనాథం బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష 57వ రోజూ కొనసాగింది.
ఆమదాలవలసలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 16వ రోజూ దీక్షలు కొనసాగాయి. ఆటోలతో భారీ ర్యాలీ జరిగింది. తమ్మినేని సీతారాం, బొడ్డేపల్లి మాధురి, కిల్లి రామ్మోహన్‌రావులు పాల్గొన్నారు. మున్సిపల్ ఉద్యోగులు దీక్షలు కొనసాగించారు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆటోల ర్యాలీ జరిగింది. పార్టీ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, నాయకులు అప్పలనాయుడు, కె.వి.వి సత్యనారాయణ పాల్గొన్నారు.
టెక్కలిలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆటో, రిక్షాలు, ట్రాలీ రిక్షాలతో ర్యాలీ చే పట్టారు. వైఎస్సార్ కూడలి నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ జరి గింది. అనంతరం మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ రిక్షా తొక్కుతూ నిరసన తెలియజేశారు. పార్టీ నేతలు చింతాడ గణపతి, ప్రధాన రాజేంద్ర ప్రసాద్, తిర్లంగి జానకి రామయ్య, అట్టాడ రవిప్రసాద్ పాల్గొన్నారు.
సడలని సంకల్పం
Published Fri, Oct 18 2013 2:26 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
Advertisement
Advertisement