విద్యార్థినులను వేధిస్తున్న ముగ్గురు ఆకతాయిలను పోలీసులు అరెస్టు చేశారు.
విద్యార్థినులను వేధిస్తున్న ముగ్గురు ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ బీఈడీ కాలేజి వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కళాశాల వద్ద ఉండి అక్కడికి వచ్చే విద్యార్థినులతో వీరు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం ఉదయం వారిని కాపుకాసి పట్టుకున్నారు.