విశాఖపట్నం : మునగపాక మండలం గణపర్తి వద్ద బుధవారం ఉదయం శారదానదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు తూచకొండ గ్రామానికి చెందిన సాయి(14), మణికంఠ(13) లుగా గుర్తించారు.
ఉదయం 9 గంటలకు నదిలో స్నానానికి దిగారు. వీరిద్దరికీ ఈత రాకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో సాయి మృతదేహం బయటపడింది. మణికంఠ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. విద్యార్థుల మృతితో వాళ్ల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.