సాక్షి ప్రతినిధి, అనంతపురం : సహకార సంఘం ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. ఏడు స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో ఐదు చోట్ల విజయకేతనం ఎగురవేసి.. మరో స్థానంలో సీపీఐ మద్దతుతో పాగా వేయనున్నారు. భయోత్పాతం సృష్టించి ఒక స్థానాన్ని టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌కు రిక్త హస్తమే మిగిలింది. మొత్తానికి కాంగ్రెస్, టీడీపీ సంయుక్తంగా మద్దతు ఇచ్చినా..నోట్ల కట్టలనువిచ్చలవిడిగావెదజల్లినావైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుల విజయాన్నిఅడ్డుకోలేకపోయారు.
జిల్లాలో ఏడాది క్రితం 116 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. బూదిలి, తలుపుల, రామగిరి, పి.యాలేరు, పెద్దవడుగూరు, వేములపాడు, పుట్లూరు పీఏసీఎస్‌ల్లో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించడం ఖాయమనే అంచనాకు వచ్చిన కాంగ్రెస్, టీడీపీలు.. శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపి వాటి ఎన్నికలను వాయిదా వేయించాయి.
ఆ ఏడు పీఏసీఎస్‌లకు ఎట్టకేలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలను వేదికగా చేసుకుని సత్తా చాటడానికి జేసీ బ్రదర్స్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తమ పరిధిలోని పీఏసీఎస్‌లలో తమ మద్దతుదారులను గెలిపించుకోవడం ద్వారా టీడీపీలోకి ఘనంగా వెళ్లాలని భావించారు. తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని పెద్దవడుగూరు, వేములపాడు పీఏసీఎస్‌ల పరిధిలో జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డిలు విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీతో ముందస్తు అవగాహన కుదర్చుకుని అభ్యర్థులను బరిలోకి దించారు. ఓటుకు సగటున రూ.ఐదు వేల వరకూ పంపిణీ చేశారు.
కానీ.. ఓటర్లు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులకు దన్నుగా నిలిచారు. ఆ పార్టీ నేతలు పేరం నాగిరెడ్డి, వీఆర్ రామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, శరభారెడ్డిలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ జేసీ బ్రదర్స్ ఎత్తులను చిత్తు చేశారు. పెద్దవడుగూరు పీఏసీఎస్ పరిధిలోని 13 డెరైక్టర్ స్థానాల్లో 12 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. ఎనిమిదింటిలో వైఎస్‌ఆర్‌సీపీ, మూడింటిలో కాంగ్రెస్, ఒక స్థానంలో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. వేములపాడు పీఏసీఎస్ పరిధిలోని 13 స్థానాల్లో నాలుగింట్లో వైఎస్‌ఆర్‌సీపీ, ఐదింట్లో కాంగ్రెస్, మూడింట్లో సీపీఐ, ఒక స్థానంలో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. సీపీఐ మద్దతుతో వేములపాడు పీఏసీఎస్‌ను కూడా వైఎస్‌ఆర్‌సీపీ తన ఖాతాలో వేసుకోవడానికి పావులు కదుపుతోంది.
శైలూ, నిమ్మలకు ఝలక్
పుట్లూరు పీఏసీఎస్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకునే బాధ్యతను జేసీ ప్రభాకర్‌రెడ్డికి మంత్రి శైలజానాథ్ అప్పగించారు. ఇక్కడ టీడీపీ-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దించింది. నోట్ల కట్టలను విచ్చలవిడిగా వెదజల్లింది. మద్యాన్ని ఏరులై పారించింది. అయితే వైఎస్‌ఆర్‌సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి పెద్దారెడ్డి, మండల కన్వీనర్ రాఘవరెడ్డిలు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. మూడు డెరైక్టర్ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులను ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు. శుక్రవారం ఎన్నికలు జరిగిన పది డెరైక్టర్ స్థానాల్లో ఆరింట వైఎస్సార్‌సీపీ, నాలుగింట కాంగ్రెస్-టీడీపీ సంయుక్త అభ్యర్థులు విజయం సాధించారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డితో శైలజానాథ్ చేతులు కలిపినా తన ఇలాకాలో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఎంపీ నిమ్మల క్రిష్టప్పకూ సొంత మండలంలో ఘెర పరాభవం ఎదురైంది. గోరంట్ల మండల పరిధిలోని బూదిలి పీఏసీఎస్‌లో 13 డెరైక్టర్ స్థానాల్లో కాంగ్రెస్-టీడీపీ సంయుక్తంగా అభ్యర్థులను బరిలోకి దింపినా.. కనీసం బోణీ కూడా కొట్టలేకపోయారు. కదిరి నియోజకవర్గం పరిధిలోని తలుపుల పీఏసీఎస్‌ను వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు ఏకగీవ్రంగా కైవసం చేసుకున్నారు. తలుపుల పీఏసీఎస్ పరిధిలోని 13 డెరైక్టర్ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు ఎనిమిది, టీడీపీ మద్దతుదారులు ఐదు స్థానాల్లో ఏకగీవ్రంగా విజయం సాధించారు.
రామగిరిలో హైడ్రామా
రామగిరి ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం.. ఆత్మకూరు మండలం పి.యాలేరు పీఏసీఎస్ పరిధిలో కల్లోలిత గ్రామాలు లేవు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం సాధించలేమని భావించిన ఎమ్మెల్యే పరిటాల సునీత ఓ మంత్రి సహాయాన్ని అర్థించారు. ఆ మంత్రి ఆదేశాలకు పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గి.. పి.యాలేరులో 200 మంది పోలీసులను మోహరించి, పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదే రామగిరిలో కేవలం 20 మంది పోలీసులను మోహరించి బందోబస్తును సక్రమంగా ఏర్పాటు చేయలేదు.
ఇదే అలుసుగా తీసుకున్న పరిటాల సునీత తన వర్గీయులను రె చ్చగొట్టారు. ఆమె సోదరుడు బాలాజీ నేతృత్వం లో వైఎస్సార్‌సీపీ నేతలు ముకుందనాయుడు, అమర్‌నాథ్‌రెడ్డిలు ప్రయాణిస్తోన్న వాహనంపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో రామగిరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడి చేసిన సురేందర్ అనే కార్యకర్తలను పోలీసులు అ దుపులోకి తీసుకుంటే.. పరిటాల సునీత స్టేషన్‌కు వచ్చి ఆయనను విడిపించుకుని వెళ్లారు. ఓటేసేం దుకు వస్తోన్న వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇది పో లింగ్ శాతాన్ని తగ్గేలా చేసింది. అదే టీడీపీకి వరం గా మారింది. భయోత్పాతం సృష్టించి రామగిరి పీఏసీఎస్‌ను టీడీపీ ఖాతాలో వేసుకున్నారు. పి.యాలేరు పీఏసీఎస్ ఎన్నికల్లో 13 డెరైక్టర్ స్థానాలకుగా ఆదిలోనే రెండు స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు ఏకగీవ్రంగా చేజిక్కించుకున్నా రు. ఎన్నికలు జరిగిన 11 స్థానాల్లో తొమ్మిదింట వైఎఎస్‌ఆర్‌సీపీ.. రెండు చోట్ల స్వల్ఫ ఆధిక్యంతో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు.
విజయ భేరి
Published Sat, Jan 11 2014 2:42 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement