జిల్లాలో రెండు వేర్వేరు సంఘటనలు. వీపనగండ్ల మండలం వెల్టూర్‌కు చెందిన సుజాత(28) పిల్లలతో సహా బీచు పల్లి వద్ద కృష్ణమ్మ ఒడిలో కలిసి పోయింది. అయిజకు చెందిన గడిగె మహదేవ్ (40) ‘ నేను నీకు ఇక చికిత్స చేయించలేను, చేసిన అప్పులూ తీర్చలేను..ఇక దొరకదు కూడా’ అని చివరి ఫోన్ భార్య సునీతకు చేసి ఉరేసుకొని ఈ లోకాన్ని వీడాడు. రెండింటికీ ‘ఆర్థికమే’ కీలకం. ఇరు కుటుంబాల్లోనూ అదే విషాదం చిమ్మింది. బతుకు ఈడ్వలేమనుకొని వారు నూరేళ్ల జీవితానికి మధ్యలోనే చెల్లుచీటీ పలికేశారు. మధ్య తరగతి బతుకు తీరును చెప్పారు.
వీపనగండ్ల / ఇటిక్యాల, న్యూస్‌లైన్: మండలంలోని వెల్టూర్‌కు చెందిన కామిరెడ్డి సుజాత (28), కుమారుడు రేవంత్‌కుమార్ (5), కూతురు ధరణి అలియాస్ చింకి (3) ని గురువారం రాత్రి ఇటిక్యాల మండలం బీచుపల్లి సమీపంలోని కృష్ణానది బ్రిడ్జిపై నుంచి విసిరేసి తాను దూకింది. శుక్రవారం సాయంత్రం తల్లి, కొడుకు మృతదేహాలు లభ్యం కావడం, కూతు రి గల్లంతుతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎలాంటి భూమి లేకపోవడంతో భార్యాభర్తలు సుజాత, వెంకటయ్య స్థానికంగా కొన్నాళ్లు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. మూడు నెలల క్రితం వారు హైదరాబాద్‌లోని ఎల్లమ్మబండలో ఉన్న సుజాత అన్న దగ్గరికి బతుకుదెరువు కోసం వలస వెళ్లారు.
డిగ్రా వరకు చదివిన భార్య టైలరింగ్ పనిచేస్తూ ఉండేది. భార్యాభర్తల మధ్య కుటుంబ తగాదాలు ఉన్నాయని బంధువులు తెలిపారు. 20 రోజుల క్రితం భర్త స్వగ్రామానికి చీటీ డబ్బులు కట్టేందుకు వచ్చి ఇక్కడే దొరికినపని చేసుకుంటూ ఉండిపోయాడు. ఈ క్రమంలోనే తల్లి, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటం గ్రామస్తులను కలిచి వేసింది. మృతురాలి ఇంటిదగ్గర కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలు కంటతడి పెట్టించాయి. ఇదిలాఉండగా రెండేళ్ల క్రితం వీపనగండ్ల మండలం లక్ష్మీపురానికి చెందిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో వచ్చి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏడాది క్రితం పెబ్బేరు మండలానికి చెందిన తల్లి, కూతురు ఇదే ప్రాంతంలో కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
చితికిన బతుకులు
Published Sat, Feb 8 2014 3:03 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement